విరాట్‌ను అవుట్ చేయడం తేలిక కాదు : హాజెల్‌వుడ్

దిశ, స్పోర్ట్స్: వైట్ బాల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీని అవుట్ చేసినంత తేలికగా టెస్టు క్రికెట్‌లో అవుట్ చేయలేమని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజెల్‌వుడ్ అన్నాడు. ఈ ఏడాది వరుసగా నాలుగు వన్డేల్లో కోహ్లీ వికెట్‌ను తీసి హాజెల్‌వుడ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. వన్డేల్లో టాప్ ర్యాంక్ బ్యాట్స్‌మాన్‌ను వరుసగా అవుట్ చేయడం అంత తేలిక కాదు. కానీ నాకు కొంచెం అదృష్టం కూడా తోడైంది. అందుకే కోహ్లీ వికెట్ తనకు దక్కిందన్నాడు. వన్డేలతో పోలిస్తే కోహ్లీ […]

Update: 2020-12-13 11:45 GMT

దిశ, స్పోర్ట్స్: వైట్ బాల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీని అవుట్ చేసినంత తేలికగా టెస్టు క్రికెట్‌లో అవుట్ చేయలేమని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజెల్‌వుడ్ అన్నాడు. ఈ ఏడాది వరుసగా నాలుగు వన్డేల్లో కోహ్లీ వికెట్‌ను తీసి హాజెల్‌వుడ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. వన్డేల్లో టాప్ ర్యాంక్ బ్యాట్స్‌మాన్‌ను వరుసగా అవుట్ చేయడం అంత తేలిక కాదు. కానీ నాకు కొంచెం అదృష్టం కూడా తోడైంది. అందుకే కోహ్లీ వికెట్ తనకు దక్కిందన్నాడు. వన్డేలతో పోలిస్తే కోహ్లీ టెస్టుల్లో మరింత ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తాడు. కాబట్టి అతడిని టెస్టుల్లో బోల్తా కొట్టించాలంటే నేను మరిన్ని వ్యూహాలు రచించాలి అని హాజెల్‌వుడ్ అన్నాడు. గత పర్యటనలో భారత జట్టుకు మేము సరిగా బౌలింగ్ చేయలేకపోయాము. కానీ ఈ సారి మిచెల్ స్టార్క్ కూడా ఉండటంతో బౌలింగ్ మరింత పటిష్టంగా మారిందని హాజెల్‌వుడ్ అన్నాడు. డిసెంబర్ 17 నుంచి పింక్ బాల్ టెస్టు ప్రారంభం కానుంది. పింక్ బంతితో అత్యధిక వికెట్లు (42) పడగొట్టిన రికార్డు స్టార్క్ పేరిటే ఉన్నది.

Tags:    

Similar News