కోవిడ్-19పై రీసెర్చ్‌లో ఆసక్తికర విషయాలు

న్యూఢిల్లీ: కరోనావైరస్‌కు సంబంధించి ఓ ఆందోళనకర విషయం బయటపడింది. ఈ వైరస్ బారిన పడి నిరోధక శక్తిని పెంపొందించుకున్నవారిలో ఆ శక్తి ఎక్కువ కాలం నిలవడం లేదు. నెలల వ్యవధిలోనే ఆ శక్తి నిర్వీర్యమైపోతున్నది. వారు మళ్లీ ఈ మహమ్మారి ముందు దుర్భలులుగా మారుతున్నారి ఓ అధ్యయనం వెల్లడించింది. లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు 96 మంది కరోనా పాజిటివ్ వ్యక్తుల రక్తనమూనాలను నెలలపాటు పరిశీలించారు. వారి రక్తంలోని యాంటీబాడీల తీరును ఎప్పటికప్పుడు సమీక్షించారు. కరోనా లక్షణాలు […]

Update: 2020-07-14 03:34 GMT

న్యూఢిల్లీ: కరోనావైరస్‌కు సంబంధించి ఓ ఆందోళనకర విషయం బయటపడింది. ఈ వైరస్ బారిన పడి నిరోధక శక్తిని పెంపొందించుకున్నవారిలో ఆ శక్తి ఎక్కువ కాలం నిలవడం లేదు. నెలల వ్యవధిలోనే ఆ శక్తి నిర్వీర్యమైపోతున్నది. వారు మళ్లీ ఈ మహమ్మారి ముందు దుర్భలులుగా మారుతున్నారి ఓ అధ్యయనం వెల్లడించింది. లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు 96 మంది కరోనా పాజిటివ్ వ్యక్తుల రక్తనమూనాలను నెలలపాటు పరిశీలించారు. వారి రక్తంలోని యాంటీబాడీల తీరును ఎప్పటికప్పుడు సమీక్షించారు. కరోనా లక్షణాలు కనిపించిన తొలి మూడువారాల్లో యాంటీబాడీలు చాలా పెరిగాయని, చురుకుగా కదిలాయని ఆ పరిశోధకులు ఓ పరిశోధనాపత్రంలో వెల్లడించారు. కొవిడ్ 19 చెరలో ఉన్నప్పుడు 60శాతం మందిలో ఆ వైరస్‌పై పోరాటానికి యాంటీబాడీలు మెరుగ్గా ఉత్పత్తయ్యాయని, కానీ, కేవలం 17శాతం మందిలో మాత్రమే మూడు నెలల వరకు ఈ యాంటీబాడీలు కొనసాగాయాని వివరించారు. అయితే కరోనా తీవ్రత అధికంగా ఉన్నవారిలోనే యాంటీబాడీలు దీర్ఘకాలంగా కనిపించాయని, స్వల్పంగా ఉన్నవారిలో మూడు నెలల వరకు యాంటీబాడీలు దాదాపుగా కనిపించనేలేదని తెలిపారు. ఈ స్టడీపై ఇంకా పరిశోధకులు విస్తృత చర్చ జరపాల్సి ఉన్నది.

సాధారణంగా మనదేశంలోకి ఏదైన వైరస్ ప్రవేశించినప్పుడు దాన్ని గుర్తించి చంపేయడానికి తెల్లరక్తకణాలు చేరుతాయి. ఈ క్రమంలోనే ప్రోటీన్లు లేదా యాంటీబాడీలను శరీరం ఉత్పత్తి చేసుకుంటుంది. ఆ యాంటీబాడీలు దేహంలో నిల్వ ఉన్నన్నాళ్లు సదరు వైరస్ నుంచి వారికి రక్షణ(ఇమ్యూనిటీ) ఉంటుంది. అయితే, ఈ యాంటీబాడీలు ఒక్కసారి ఉత్పత్తి అయిన తర్వాత ఎప్పటికీ ఉంటాయని భావించరాదని తాజాగా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇన్‌ఫ్లుయెంజా వైరస్ లాంటి విషయాల్లో ఈ పద్ధతిని అస్సలు విశ్వసించరాదని చెప్పారు.

హెర్డ్ ఇమ్యూనిటీ ప్రశ్నార్థకమేనా?

ఇతర కరోనావైరస్‌ల్లాగే కొవిడ్ 19 కూడా తిరిగి సోకే ప్రమాదమున్నదని తెలిపిన ఈ స్టడీ పలు ఆందోళనకర అంశాలను మనముందుంచింది. కొవిడ్ 19 ఎదుర్కొనే యాంటీబాడీలు నెలల వ్యవధిలోనే మాయమైతే హెర్డ్ ఇమ్యూనిటీ ఎప్పటికీ రాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్ వల్లనైనా, సామాజిక వ్యాప్తి తదనంతర దశలోనైనా ఈ దశ చేరుకోవడం కష్టమేనని వివరిస్తున్నారు. ఈ అధ్యయనం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వాలు పున:సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని లేవనెత్తింది. వ్యాక్సిన్ తయారీలోనూ ఇమ్యూన్ రెస్పాన్స్‌ తీరునూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నదనే విషయాన్ని ముందుకు తీసుకువచ్చిందని చెబుతున్నారు.

Tags:    

Similar News