బోనకల్‌లో జోరుగా వడ్డీ వ్యాపారం
దిశ, మధిర: ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో చాలా కాలంగా అధిక వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది వడ్డీ వ్యాపారులు స్థానికంగా ఉన్న వారితో కలిసి ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులు, చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, రోజు కూలీ చేసుకునేవారే ఈ వడ్డీ వ్యాపారుల టార్గెట్. సులభ వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చు అంటూ ఆశ చూపుతూ అక్రమంగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఎక్కువగా వీరు […]
దిశ, మధిర: ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో చాలా కాలంగా అధిక వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది వడ్డీ వ్యాపారులు స్థానికంగా ఉన్న వారితో కలిసి ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులు, చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, రోజు కూలీ చేసుకునేవారే ఈ వడ్డీ వ్యాపారుల టార్గెట్. సులభ వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చు అంటూ ఆశ చూపుతూ అక్రమంగా వ్యాపారం కొనసాగిస్తున్నారు.
ఎక్కువగా వీరు రాజమండ్రి ప్రాంతానికి చెందినవారుగా సమాచారం. అత్యవసరంగా ఎవరికైనా డబ్బులు అవసరం వస్తే ఇంతకు ముందు తమ వద్ద తీసుకున్న వ్యాపారుల నుంచి రికమండ్ చేయించుకోవడంతోపాటు ఖాళీ ప్రాంసరీ నోటు పైన సంతకాలు చేసి ఇవ్వాలి. ముందుగా వీరు చెప్పే మాటలకు, వడ్డీ కట్టే విధానానికి పొంతన ఏ మాత్రం ఉండదు. ముందు నూటికి రెండు రూపాయల వడ్డీ.. వారానికి కొంత చెల్లిస్తే సరిపోతుంది అంటూ మూడు నెలల కాలపరిమితిని విధిస్తారు. కానీ, చివరికి మొత్తం చెల్లించేటప్పటికి రూ.6 పైగానే వరకు చెల్లించవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకు ఇంత వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఇది వడ్డీ వ్యాపారం ఇలానే ఉంటుంది.. మీరు ఒకవేళ చెల్లించలేకపోతే మీరు ఇచ్చిన ప్రాంసరీ నోట్టు మా వద్ద ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
చాలామంది కరోనా వల్ల పనులు లేక తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేకపోతున్నారు. దీంతో ఈ వడ్డీ వ్యాపారులు కూలీలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పుకుంటే తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో ఎంత వడ్డీ అయినా చెల్లించక తప్పడంలేదంటూ వారు ఆవేదన చెందుతున్నారు. మండల కేంద్రంలో రోజుకో ఊరు చొప్పున వారానికి ఏడు రోజులు వీరి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. మండల కేంద్రంలో జరుగుతున్న ఈ దందా గురించి అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారుల నుండి కాపాడాలని కోరుకుంటున్నారు.