నిబంధనలకు నీళ్లు.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
దిశ, అల్వాల్: అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అల్వాల్సర్కిల్లో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగల్లా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ప్రభుత్వ నిబంధనలను సైతం పట్టించుకోవడం లేదు. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి సెట్బ్యాక్లేకుండానే వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నారు. పేదవాడు గుడిసె వేసుకుంటే వెంటనే తొలగించే అధికారులు కళ్లముందు అక్రమ నిర్మాణాలు కనబడుతున్నా పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. అక్రమార్కలతో చీకటి ఒప్పందమా? లేక రాజకీయ నాయకుల […]
దిశ, అల్వాల్: అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అల్వాల్సర్కిల్లో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగల్లా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ప్రభుత్వ నిబంధనలను సైతం పట్టించుకోవడం లేదు. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి సెట్బ్యాక్లేకుండానే వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నారు. పేదవాడు గుడిసె వేసుకుంటే వెంటనే తొలగించే అధికారులు కళ్లముందు అక్రమ నిర్మాణాలు కనబడుతున్నా పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. అక్రమార్కలతో చీకటి ఒప్పందమా? లేక రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కారణమా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అల్వాల్ సర్కిల్ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రోజురోజుకూ అక్రమ నిర్మాణాలు పెరిగి పోతున్నా అడిగే నాథుడు లేడు. దీంతో అక్రమదారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. పేదోడు ఉండిలేక ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే సవాలక్ష ప్రశ్నలతో వేధించే అధికారులు రోడ్డును ఆనుకుని ఎలాంటి సెట్ బ్యాక్‌లు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార సముదాయాలు నిర్మిస్తుంటే ఎందుకు అటువైపు టౌన్‌ప్లానింగ్ అధికారులు చూడడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కటి కాదు రెండుకాదు సర్కిల్ మొత్తంగా పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే కళ్లు ఉండి చూడలేని కబోధిలా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అక్రమార్కులతో చేసుకున్న చీకటి ఒప్పందంతోనా లేక రాజకీయ ఒత్తిళ్లతో అటువైపు కన్నెత్తి చూడడం లేదా అల్వాల్ వాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వ్యాపార నిర్మాణాలపై కూడ అదే వైఖరి వ్యవహరిస్తున్నారు. బొల్లారం కొంపల్లి రోడ్డులో అక్రమంగా ఎలాంటి అనుమతిలేకుండా నిర్మిస్తున్న వ్యాపార సముదాయం, కానాజీగూడ మనస సరోవరం రోడ్డులో ఎలాంటి సెట్‌బ్యాక్ లేకుండా రోడ్డును ఆనుకుని నిర్మిస్తున్న నిర్మాణాలను తక్షణమే అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారుల పక్షపాత వైఖరి మారాలని, ఉన్నడోని ఒక విధంగా, లేనివాడిని ఒక విధంగా చూడడం మానుకోవాలంటున్నారు. ఎవరైనా నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టేవిధంగా చూడాల్సిన బాధ్యత టౌన్‌ప్లానింగ్ అధికారులుదేనని అంటున్నారు.
సెక్షన్ అధికారులు లేని టౌన్ ప్లానింగ్..
అల్వాల్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌కు అధికారులు లేరు. ఒక అధికారి రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో సెలవులో ఉన్నారు. మరో అధికారి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. ఇక మిగిలింది ఏసీపీ అధికారి ఒక్కరే. దీంతో ఫీల్డ్‌లో తిరిగి అక్రమాలను అరికట్టే యంత్రాంగం లేక అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్ఉతన్నాయి. తక్షణమే సెక్షన్ అధికారులను నియమించి అక్రమ నిర్మాణాలను అరికట్టాలని కోరుతున్నారు.