అధికారుల నిర్లక్ష్యం.. సర్కారు భూములు, రోడ్లను ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు

దిశ, సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ 18వ వార్డులో రోడ్లను ఆక్రమిస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. నిత్యం వందలాది మంది నడిచే రోడ్లను కబ్జా చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రభుత్వ భూములను, రోడ్లను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పదే పదే మున్సిపల్ కమిషనర్ చెబుతున్నప్పటికీ వారి మాటలను కబ్జాదారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఏకంగా రోడ్లను ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నా స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో కబ్జాదారులు కొందరు […]

Update: 2021-10-23 02:38 GMT

దిశ, సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ 18వ వార్డులో రోడ్లను ఆక్రమిస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. నిత్యం వందలాది మంది నడిచే రోడ్లను కబ్జా చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రభుత్వ భూములను, రోడ్లను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పదే పదే మున్సిపల్ కమిషనర్ చెబుతున్నప్పటికీ వారి మాటలను కబ్జాదారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఏకంగా రోడ్లను ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నా స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం.

దీంతో కబ్జాదారులు కొందరు స్థానిక పెద్ద మనుషుల అండతో తమ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతూ చెలరేగిపోతున్నారు. గతంలో ప్రభుత్వం.. ఇంటి నిర్మాణానికి 67 గజాల స్థలం కేటాయిస్తే అక్రమార్కులు ఆ భూమి కాకుండా పక్కనే ఉన్న కాలువలను, రోడ్లను ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. ఓ వైపు మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో స్థానిక 18వ వార్డు కౌన్సిలర్ కమల చంద్రునాయక్ ఆధ్వర్యంలో ఇటీవల పెద్ద ఎత్తున మురికి కాలువలు, రోడ్లు, నాలాల నిర్మాణం పూర్తి చేశారు. కానీ వీటిని సైతం కబ్జాదారులు ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎవరూ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News