సినిమాల్లేకపోతే ఇలియానా ఏం చేస్తదో తెలుసా?
తన నడుము అందాలతో కుర్రకారు మతి పోగొట్టిన ఇలియానా.. దేవదాసు సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇల్లీ బేబీ తెలుగులో ఓ వెలుగు వెలుగుతున్న టైమ్‌లోనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బాలీవుడ్‌కు చెక్కేసింది. కానీ, అక్కడ టైమ్ కలిసిరాక ఫేడ్ అవుట్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్‌తోనూ బ్రేకప్ కావడంతో అటు రీల్ లైఫ్.. ఇటు రియల్ లైఫ్‌లోనూ ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతానికి చేతిలో కొన్ని సినిమాలున్నా.. లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ వాయిదా పడటంతో […]
తన నడుము అందాలతో కుర్రకారు మతి పోగొట్టిన ఇలియానా.. దేవదాసు సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇల్లీ బేబీ తెలుగులో ఓ వెలుగు వెలుగుతున్న టైమ్‌లోనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బాలీవుడ్‌కు చెక్కేసింది. కానీ, అక్కడ టైమ్ కలిసిరాక ఫేడ్ అవుట్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్‌తోనూ బ్రేకప్ కావడంతో అటు రీల్ లైఫ్.. ఇటు రియల్ లైఫ్‌లోనూ ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతానికి చేతిలో కొన్ని సినిమాలున్నా.. లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ వాయిదా పడటంతో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది ఇలియానా.
కుంచె పట్టి డ్రాయింగ్ వేసిన ఈ భామ.. ‘స్టార్ట్ చేసేటప్పుడు నా మైండ్‌లో ఏమీ లేదు.. కానీ పూర్తయ్యేసరికి హృదయ స్పందన, ఆశతో మెరుస్తున్న అనుభూతి కలిగేలా ఒక రూపం వచ్చింది’ అంటూ తన పెయింటింగ్‌ను స్టేటస్‌లో షేర్ చేసింది. అంతేకాదు ఫ్రెష్ బ్రెడ్ ప్రిపేర్ చేసేందుకు ట్రై చేసినా ఇలియానా.. సూపర్ సక్సెస్ అయిందని చెప్పింది. సినిమాలు మాత్రమే కాకుండా ఇక చెఫ్‌గా కూడా రాణించగలనంటోంది.
ఈ మధ్య సినిమాలతోపాటు స్పోర్ట్స్ చానల్ యాంకర్‌గా తన కెరియర్ను కొనసాగించాలని ఇల్లి బేబీ నిర్ణయించుకున్నట్టు వార్తలొచ్చాయి. మొత్తానికి సినిమాలు లేకున్నా ఇలియానా లైఫ్‌కు ఎలాంటి ఢోకా లేదన్నమాట.