జీతాలు చెల్లించాలంటూ ఐఎఫ్‌టీయూ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష

దిశ, మణుగూరు : కొవిడ్ సెంటర్‌లో పని చేసిన వర్కర్లకు వెంటనే వేతనాలు చెల్లించాలని ఐఎఫ్‌టీయు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఐఎఫ్‌టీయు కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ సెంటర్‌లో పని చేసిన వర్కర్లకు నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. వేతనాలు చెల్లించాలని డీఎంహెచ్ఓ, స్థానిక తహసీల్దార్, హాస్పిటల్ ఇంచార్జీ దృష్టికి తీసుకెళ్లినా […]

Update: 2021-08-06 05:15 GMT

దిశ, మణుగూరు : కొవిడ్ సెంటర్‌లో పని చేసిన వర్కర్లకు వెంటనే వేతనాలు చెల్లించాలని ఐఎఫ్‌టీయు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఐఎఫ్‌టీయు కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ సెంటర్‌లో పని చేసిన వర్కర్లకు నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. వేతనాలు చెల్లించాలని డీఎంహెచ్ఓ, స్థానిక తహసీల్దార్, హాస్పిటల్ ఇంచార్జీ దృష్టికి తీసుకెళ్లినా కొంచెం కూడా చలనం లేదన్నారు. వేతనాలు లేక వర్కర్ల కుటుంబాలు పస్తులు ఉంటూ, నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్కర్ల చేసిన పనికి వేతనాలు చెల్లించమని అడుగుతుంటే ఏ ఒక్క అధికారి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

వర్కర్లకు వేతనాలు చెల్లించకపోవడంతో మనోవేదనకు గురై స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఆవేదనతో దీక్షచేపట్టామని, వర్కర్లకు ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వర్కర్లపై కొంచెం కూడా కనికరం చూపదా అని ప్రశ్నించారు. వెంటనే వర్కర్లకు వేతనాలు చెల్లించకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని వర్కర్ల జీతాలు వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయు మణుగూరు ఏరియా నాయకులు ఎండీగౌస్, మహాలక్ష్మి, రాణి, భారతమ్మ, మంగమ్మ, జయమ్మ, శైలజ, జానకి, రాంబాయమ్మ, రాములు, పి.రాములు, తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News