ప్లాట్ నెంబర్ లేకుంటే..

దిశ, తెలంగాణ బ్యూరో: యాదగిరిగుట్టలో అనుమతిలేని లేఅవుట్‌లో పి.శ్రీనివాస్ గుంటల రూపేణా 484 చ.గ.లను తీసుకున్నాడు. లేఅవుట్ చేశారుగానీ, ప్లాట్ల నెంబర్లు లేవు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకుందామని శ్రీనివాస్ కంప్యూటర్ లో దరఖాస్తును నింపుతుండగా పదేపదే ప్లాట్ నెంబర్ భర్తీ చేయాలని సూచిస్తుంది. అతడి భూమికి ప్లాట్ నెంబర్ లేకపోవడంతో నేరుగా యాదగిరిగుట్ట మున్సిపల్​ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించగా ప్లాట్ నెంబర్ వేయాల్సిందేనని తేల్చిచెప్పారు. మీసేవకు వెళ్లి విచారించగా నెంబర్ లేకుండా దరఖాస్తును నింపలేమన్నారు. ఇదీ […]

Update: 2020-10-04 03:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: యాదగిరిగుట్టలో అనుమతిలేని లేఅవుట్‌లో పి.శ్రీనివాస్ గుంటల రూపేణా 484 చ.గ.లను తీసుకున్నాడు. లేఅవుట్ చేశారుగానీ, ప్లాట్ల నెంబర్లు లేవు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకుందామని శ్రీనివాస్ కంప్యూటర్ లో దరఖాస్తును నింపుతుండగా పదేపదే ప్లాట్ నెంబర్ భర్తీ చేయాలని సూచిస్తుంది. అతడి భూమికి ప్లాట్ నెంబర్ లేకపోవడంతో నేరుగా యాదగిరిగుట్ట మున్సిపల్​ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించగా ప్లాట్ నెంబర్ వేయాల్సిందేనని తేల్చిచెప్పారు. మీసేవకు వెళ్లి విచారించగా నెంబర్ లేకుండా దరఖాస్తును నింపలేమన్నారు.

ఇదీ ఎల్ఆర్ఎస్‌లో గ్రామీణ ప్రజలకు ఎదురవుతున్న ప్రధాన సమస్య. ప్లాట్ నెంబర్ లేని వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది దరఖాస్తుపత్రం లో వెల్లడించలేదు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపించలేదు. ఫలితంగా గ్రామీణ ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలని పలువురు దరఖాస్తుదారులు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో ప్లాట్ నెంబర్ లేనివారికి తగిన సూచనలు చేయడం లేదా మరో దరఖాస్తును అందుబాటులోకి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఇక మిగిలింది 11 రోజులే..

ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు ఈ నెల 15 తో ముగియనున్నది. మరో 11 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. తుది గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఏమి చేయాలో తెలియక శ్రీనివాస్‌లాంటి వారు ఏదో ఒక నెంబర్‌ను దరఖాస్తులో నమోదు చేస్తూ సబ్‌మిట్ చేస్తున్నారు. అదే నెంబర్ పై ప్రక్కనున్న ప్లాట్ల వారు వేస్తారేమోననే ఆందోళన వారిలో మొదలైంది. ఒకే నెంబర్ ప్లాట్లు ఒకే సర్వే నెంబర్‌లో వస్తే పరిష్కారమయ్యే సమయంలో ఏదేని సమస్యలు తలెత్తుతాయేమోననే ప్రశ్న వారి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. మరి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News