సెల్ఫ్ లాక్ డౌన్ పాటించకపోతే.. రూ. 3 వేల జరిమానా

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓ వైపున ప్రభుత్వం అన్‌లాక్ వైపు సాగుతుంటే గ్రామాల్లో మాత్రం లాక్‌డౌన్ దిశగా ముందుకు సాగుతున్నారు. తాజాగా కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడు గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని గ్రామ పంచాయతీ స్వీయ నిర్భందం పాటించాలని నిర్ణయించింది. గ్రామంలో ఉదయం 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే కిరాణా షాపులు తెరవాలని నిర్ణయించారు. మిగతా సమయంలో షాపులు తెరిస్తే రూ. 3 […]

Update: 2020-07-29 09:40 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓ వైపున ప్రభుత్వం అన్‌లాక్ వైపు సాగుతుంటే గ్రామాల్లో మాత్రం లాక్‌డౌన్ దిశగా ముందుకు సాగుతున్నారు. తాజాగా కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడు గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని గ్రామ పంచాయతీ స్వీయ నిర్భందం పాటించాలని నిర్ణయించింది. గ్రామంలో ఉదయం 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే కిరాణా షాపులు తెరవాలని నిర్ణయించారు. మిగతా సమయంలో షాపులు తెరిస్తే రూ. 3 వేల జరిమానా, మాంసాహార దుకాణాలు ఉదయం 9 గంటల వరకు మాత్రమే తెరవాలని ఆ తరువాత తెరిస్తే రూ. 3 వేలు, బెల్టు షాపులు తెరిస్తే రూ. 5 వేలు, వైన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ఉన్న వారికే మద్యం అమ్మకాలు జరపాలని నిర్ణయించారు. అయితే టిఫిన్ సెంటర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదని, ఇతర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లో గ్రామానికి రాకూడదని, ఈ గ్రామం వారు వేరే గ్రామానికి వెళ్లకూడదని తీర్మాణించారు. ఆగస్టు 10 వరకు ఈ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు తీర్మాణించారు.

Tags:    

Similar News