కడంబా ఎన్‎కౌంటర్ మృతుల గుర్తింపు..!

దిశప్రతినిధి, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‎నగర్ పోలీస్ డివిజన్‎లోని కడంబా ఫారెస్ట్‎లో జరిగిన ఎన్‎కౌంటర్‎లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్‎కౌంటర్ మృతుల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్‎కౌంటర్‎లో మృతి చెందిన వారిలో చత్తీస్‎ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామిడికి చెందిన చొక్కాలు, అదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం యాపల్‎గూడకు చెందిన జుగ్నాక బాదీరావ్‎లుగా గుర్తించారు. అయితే ముందుగా ఎన్‎కౌంటర్‎లో మావోయిస్టు […]

Update: 2020-09-20 05:41 GMT

దిశప్రతినిధి, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‎నగర్ పోలీస్ డివిజన్‎లోని కడంబా ఫారెస్ట్‎లో జరిగిన ఎన్‎కౌంటర్‎లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్‎కౌంటర్ మృతుల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టారు.

ఎన్‎కౌంటర్‎లో మృతి చెందిన వారిలో చత్తీస్‎ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామిడికి చెందిన చొక్కాలు, అదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం యాపల్‎గూడకు చెందిన జుగ్నాక బాదీరావ్‎లుగా గుర్తించారు. అయితే ముందుగా ఎన్‎కౌంటర్‎లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్ భార్య కంతి లింగవ్వ, మరో మావోయిస్టు వర్గీస్ ప్రభాత్‎లు మృతి చెందినట్టు ప్రచారం జరిగింది. కానీ తాజాగా పోలీసులు వెల్లడించిన ప్రకారం మృతులు ఇద్దరూ వేరే వాళ్ళు కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా అగ్రనేత భాస్కర్ సహా మిగతా వాళ్లు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో ఒక 9 ఎంఎం పిస్టల్, 12 బోర్ తుపాకీ లభ్యమయ్యాయి. విప్లవ సాహిత్యంతో పాటు కొన్ని లేఖలు, దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News