బ్రేకింగ్ : మాజీ IAS ఇంట్లో CID సోదాలు.. కింద పడిపోయిన లక్ష్మీనారాయణ

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లోకి ఒక్కసారిగా వచ్చి దాడులు జరపడంతో మాజీ అధికారి అనుకోకుండా కిందపడిపోయారు. అయితే, బీపీ పెరిగి ఆయన కళ్లు తిరిగి పడిపోయారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అయితే, విశ్వసనీయ సమాచారం మేరకు సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుండగా ప్రస్తుతం మాజీ ఐఏఎస్ అధికారి చికిత్స […]

Update: 2021-12-10 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లోకి ఒక్కసారిగా వచ్చి దాడులు జరపడంతో మాజీ అధికారి అనుకోకుండా కిందపడిపోయారు. అయితే, బీపీ పెరిగి ఆయన కళ్లు తిరిగి పడిపోయారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఆయన్ను పరీక్షించిన వైద్యులు వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అయితే, విశ్వసనీయ సమాచారం మేరకు సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుండగా ప్రస్తుతం మాజీ ఐఏఎస్ అధికారి చికిత్స పొందుతున్నారు. ఆయన నోటీసులు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో సీఐడీ అధికారులు వారి కుటుంబసభ్యులకు నోటీసులు ఇవ్వడానికి ట్రై చేశారు. అయితే, వారు నోటీసులు తీసుకోవడానికి ఇష్టపడలేదని తెలిసింది. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో మాజీ ఐఏఎస్ అధికారి ఏ2 నిందితుడిగా కొనసాగుతున్నారు. ఈ స్కాంలో మొత్తం 13 మంది నిందితుల పేర్లను FIRలో చేర్చినట్టు సీఐడీ స్పష్టం చేసింది. ఏ4, ఏ5గా డిజైన్ టెక్, సిమెన్స్ కంపెనీ పేర్లను చేర్చింది.

Tags:    

Similar News