Hindupur: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

రైళ్లలో చోరీకి పాల్పడుతున్న ముగ్గురు దొంగలను శ్రీసత్యసాయి జిల్లా హిందూపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు..

Update: 2024-09-23 16:44 GMT

దిశ, వెబ్ డెస్క్: రైళ్లలో చోరీ(Robberies in Trains)కి పాల్పడుతున్న ముగ్గురు దొంగలను శ్రీసత్యసాయి జిల్లా హిందూపూర్(Hindupur) పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూపుర్ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వీరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. యూపీకి చెందిన ముగ్గురు యువ‌కులు రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. ప్రయాణికులకు మత్తుమందు క‌లిపిన కూల్‌డ్రింక్‌లు ఇచ్చి వారి మెడలోని గొలుసులు, ల్యాప్‌ట్యాపులు, ఇతర సామాన్లను ఎత్తుకెళ్తున్నారు. క‌ర్ణాట‌క ఎక్స్‌ప్రెస్‌, మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులే ల‌క్ష్యంగా చోరీకి పాల్పడ్డారు. నిందితుల నుంచి 50 గ్రాముల బంగారం, రెండు లాప్‌టాప్‌లు, నాలుగు సెల్‌ఫోన్లు, 895 నిద్రమాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


Similar News