ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ 2021పై రేపు నిర్ణయం

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బోర్డు సమావేశం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది. ఈ కీలక సమావేశంలో టీ20 వరల్డ్ కప్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే 2020 టీ20 వరల్డ్ కప్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నరు. 2021, 2022లో టీ20 వరల్డ్ కప్‌లు నిర్వహించాలని గతంలోనే ప్రకటించినా ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి ఈ ఏడాది ఆస్ట్రేలియాలో, వచ్చే ఏడాది ఇండియాలో ఈ టోర్నీలు జరగాల్సి ఉంది. […]

Update: 2020-08-06 09:55 GMT

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బోర్డు సమావేశం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది. ఈ కీలక సమావేశంలో టీ20 వరల్డ్ కప్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే 2020 టీ20 వరల్డ్ కప్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నరు. 2021, 2022లో టీ20 వరల్డ్ కప్‌లు నిర్వహించాలని గతంలోనే ప్రకటించినా ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి ఈ ఏడాది ఆస్ట్రేలియాలో, వచ్చే ఏడాది ఇండియాలో ఈ టోర్నీలు జరగాల్సి ఉంది. 2020 టోర్నీని రద్దు చేయడంతో వచ్చే ఏడాది అవకాశం తమకు ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరుతున్నది. 2022 టీ20 వరల్డ్ కప్‌ను ఇండియాకు కేటాయించాలని సీఏ సూచించింది. అయితే, 2022లో టీ20 వరల్డ్ కప్ 2023లో వన్డే వరల్డ్ కప్‌లు వరుసగా నిర్వహించడం తమకు కష్టమని బీసీసీఐ చెబుతున్నది. మరోవైపు 2021లో జరగాల్సిన వన్డే వరల్డ్ కప్‌పై కూడా ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. వీటితో పాటు వరల్డ్ కప్ అర్హత పోటీల నిర్వహణకు కార్యచరణను రూపొందించనుంది.

Tags:    

Similar News