పాకిస్తాన్ జట్టు వీసాలపై మార్చిలో స్పష్టత

దిశ, స్పోర్ట్స్: ఇండియాలో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. కాగా, ఇండో-పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులు వీసాలు మంజూరు చేయడం లేదు. ‘పాకిస్తాన్ జట్టుతో పాటు అభిమానులు, జర్నలిస్టులకు కూడా ఇండియా వీసాలు మంజూరు చేయాలి’ అని ఇటీవల పీసీబీ చైర్మన్ ఎహ్‌సాన్ మణి డిమాండ్ చేశారు. మార్చి నెలాఖరు లోగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని బీసీసీఐని కోరారు. అయితే బీసీసీఐ వైపు నుంచి ఎలాంటి […]

Update: 2021-02-28 10:17 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియాలో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. కాగా, ఇండో-పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులు వీసాలు మంజూరు చేయడం లేదు. ‘పాకిస్తాన్ జట్టుతో పాటు అభిమానులు, జర్నలిస్టులకు కూడా ఇండియా వీసాలు మంజూరు చేయాలి’ అని ఇటీవల పీసీబీ చైర్మన్ ఎహ్‌సాన్ మణి డిమాండ్ చేశారు. మార్చి నెలాఖరు లోగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని బీసీసీఐని కోరారు. అయితే బీసీసీఐ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పీసీబీ వెంటనే ఐసీసీని సంప్రదించింది. తమకు వీసాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎహ్‌సాన్ మణి డిమాండ్ చేశారు. అయితే మార్చి నెలాఖరులోగా వీసాలపై రాతపూర్వక హామీ లభిస్తుందని ఐసీసీ తమకు చెప్పిందని ఆదివారం ఆయన వెల్లడించారు. వాస్తవానికి డిసెంబర్ నెలాఖరులోగా బీసీసీఐ వీసాలపై ఒక హామీ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అస్వస్థత కారణంగా వాయిదా వేసినట్లు తెలిసింది.

Tags:    

Similar News