ధాన్యం లారీ దగ్దం

ఛత్తీస్గడ్​ రాష్ట్రంలో ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Update: 2024-12-22 11:59 GMT

దిశ, చర్ల : ఛత్తీస్గడ్​ రాష్ట్రంలో ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం రాయగాడ్ జిల్లా కుస్మురా ప్రాంతం నుండి దాదాపు 700 బస్తాల గల ధాన్యం లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చాకచక్యంగా వ్యవహరించిన లారీ డ్రైవర్ ప్రాణాలు కాపాడుకున్నాడు.

    ధాన్యం బస్తాలను మిల్లులకు తరలిస్తున్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన రైతులకు సంబంధించిన ధాన్యం బస్తాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక శాఖ హుటాహుటిన సంఘటనా స్థలానికి చెరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయినట్లు తెలిసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.


Similar News