ఐదో టెస్టుపై ఇక అప్పుడే నిర్ణయం

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా ఇటీవల ఇంగ్లాండ్‌లో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం సుదీర్ఘంగా పర్యటించిన విషయం తెలిసిందే. సిరీస్‌లో భాగంగా 4 టెస్టులు షెడ్యూల్ ప్రకారమే జరిగినా.. చివరి టెస్టు మాత్ర రద్దు అయ్యింది. నాలుగో టెస్టు తర్వాత టీమ్ ఇండియాలో కోవిడ్ కలకలం రేగడంతో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరగాల్సిన ఐదో టెస్టును అర్దాంతరంగా రద్దు చేశారు. ఐదో టెస్టుకు ముందు టీమ్ ఇండియాలో కరోనా కలకలం సృష్టించింది. దీంతో ఐదో టెస్టు రద్దు […]

Update: 2021-10-11 09:20 GMT

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా ఇటీవల ఇంగ్లాండ్‌లో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం సుదీర్ఘంగా పర్యటించిన విషయం తెలిసిందే. సిరీస్‌లో భాగంగా 4 టెస్టులు షెడ్యూల్ ప్రకారమే జరిగినా.. చివరి టెస్టు మాత్ర రద్దు అయ్యింది. నాలుగో టెస్టు తర్వాత టీమ్ ఇండియాలో కోవిడ్ కలకలం రేగడంతో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరగాల్సిన ఐదో టెస్టును అర్దాంతరంగా రద్దు చేశారు. ఐదో టెస్టుకు ముందు టీమ్ ఇండియాలో కరోనా కలకలం సృష్టించింది. దీంతో ఐదో టెస్టు రద్దు చేయాలని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ కోరింది. ఈ విషయంపై బీసీసీఐ-ఈసీబీ అధికారుల మధ్య చర్చ జరిగింది.

అయితే ఆ మ్యాచ్ ఫోఫిట్ (వాకోవర్) ఇవ్వాలని ఇంగ్లాండ్ కోరింది. కానీ, బీసీసీఐ అందుకు నిరాకరించింది. దీంతో ఇరు క్రికెట్ బోర్డులు ఐసీసీకి పిర్యాదు చేశాయి. సిరీస్‌లో తమను విజేతలుగా ప్రకటించి.. రద్దైన టెస్టును విడిగా ఆడటానికి అనుమతి ఇవ్వాలని బీసీసీఐ కోరుతున్నది. అయితే దీనిపై నవంబర్‌లో జరుగనున్న ఐసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసింది. మిగిలిన టెస్టును జులై 2022లో ఆడటానికి కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నది.

Tags:    

Similar News