టెస్టు ర్యాంకింగ్స్‌లో కేన్ మళ్లీ అగ్రస్థానం
దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మాన్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఒకే టెస్టు ఆడి తక్కువ స్కోరుకే అవుటవడంతో రేటింగ్ పాయింట్లు తగ్గి తన టాప్ ర్యాంకును కోల్పోయాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మాన్ స్టీవ్ స్మిత్ వరల్డ్ నెంబర్ 1 గా నిలిచాడు. అయితే ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అద్బుతంగా రాణించి జట్టు విజయానికి తోడ్పడిన విలియమ్‌సన్ తిరిగి టెస్టు ర్యాంకింగ్స్‌లో […]
దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మాన్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఒకే టెస్టు ఆడి తక్కువ స్కోరుకే అవుటవడంతో రేటింగ్ పాయింట్లు తగ్గి తన టాప్ ర్యాంకును కోల్పోయాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మాన్ స్టీవ్ స్మిత్ వరల్డ్ నెంబర్ 1 గా నిలిచాడు. అయితే ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అద్బుతంగా రాణించి జట్టు విజయానికి తోడ్పడిన విలియమ్‌సన్ తిరిగి టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో కేన్ అగ్రస్థానానికి తిరిగి చేరుకోగా.. స్టీవ్ స్మిత్ 2వ స్థానానికి పడిపోయాడు. లబుషేన్ మూడో ర్యాంకులో.. విరాట్ కోహ్లీ 4వ ర్యాంకులో కొనసాగుతున్నారు. ఇక టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ 6వ ర్యాంకులో. రిషబ్ పంత్ 7వ ర్యాంకుకు పడిపోయారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన రాస్ టేలర్ 14వ ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలర్ల విభాగంలో పాట్ కమిన్స్ 1వ ర్యాంకులో అశ్విన్ రెండో ర్యాంకులో కొనసాగుతుండగా.. ఇటీవల మంచి ప్రదర్శన కనబర్చిన కేల్ జేమిసన్ 13వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో గత వారం టాప్ ర్యాంకుకు చేరుకున్న రవీంద్ర జడేజా… తిరిగి రెండో స్థానానికి పడిపోయాడు.
టాప్ 5 టెస్టు ర్యాంకులు
బ్యాటింగ్
1. కేన్ విలియమ్‌సన్ (901)
2. స్టీవ్ స్మిత్ (891)
3. మార్నస్ లబుషేన్ (878)
4. విరాట్ కోహ్లీ (812)
5. జో రూట్ (797)
బౌలింగ్
1. పాట్ కమిన్స్ (908)
2. రవిచంద్రన్ అశ్విన్ (865)
3. టిమ్ సౌథీ (824)
4. జోష్ హాజెల్‌వుడ్ (816)
5. నీల్ వాగ్నర్ (810)
ఆల్‌రౌండర్స్
1. జేసన్ హోల్డర్ (384)
2. బెన్ స్టోక్స్ (377)
2. రవీంద్ర జడేజా (377)
4. రవిచంద్రన్ అశ్విన్ (358)
5. షకీబుల్ హసన్ (338)