సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు:ఎంపీ శ్రీ భరత్
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని విశాఖపట్నం లోక్‌సభ సభ్యులు ఎం.శ్రీ భరత్ పేర్కొన్నారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని విశాఖపట్నం లోక్‌సభ సభ్యులు ఎం.శ్రీ భరత్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని 15, 16, 23 వార్డులోని ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుల్లో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మరియు స్థానిక నాయకులు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల వల్ల పలు సమస్యలు పరిష్కారమవుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ.. చాలా కాలం నుంచి పరిష్కారానికి నోచుకోని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ మూడో జోనల్ కమిషనర్ శివప్రసాద్, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.