Home Minister:గురుకుల పాఠశాలను హోం మంత్రి అనిత ఆకస్మిక తనిఖీ
అనకాపల్లి జిల్లా నక్కపల్లి గురుకుల పాఠశాలను హోం మంత్రి వంగలపూడి అనిత ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల యోగ క్షేమాలు తెలుసుకున్నారు.
దిశ ప్రతినిధి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి గురుకుల పాఠశాలను హోం మంత్రి వంగలపూడి అనిత ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల యోగ క్షేమాలు తెలుసుకున్నారు. శనివారం మధ్యాహ్నం వసతి గృహాంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థులకు అందించే భోజన పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించి, విద్యార్థులతో కలిసి మంత్రి అనిత భోజనం చేశారు. విద్యార్థుల చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. ప్రతి విద్యార్థి చదువులో రాణించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.