'చంద్రబాబు కారుపై బాంబు వేస్తా'

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ జనాగ్రహ దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. జనాగ్రహ దీక్షలు నేడు రెండోరోజుకు చేరుకున్నాయి. జనాగ్రహ దీక్షలో వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, పట్టాభిరామ్‌లను టార్గెట్‌గా చేసుకుని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం […]

Update: 2021-10-22 02:38 GMT

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ జనాగ్రహ దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. జనాగ్రహ దీక్షలు నేడు రెండోరోజుకు చేరుకున్నాయి. జనాగ్రహ దీక్షలో వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, పట్టాభిరామ్‌లను టార్గెట్‌గా చేసుకుని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కూడా ఈ జనాగ్రహ దీక్షలు జరుగుతున్నాయి. ఈ దీక్షకు చిత్తూరు ఎంపీ రెడ్డప్పతోపాటు రెస్కో చైర్మన్ సెంథిల్‌కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెంథిల్ కుమార్ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లపై రెచ్చిపోయారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబు అండ్ టీమ్ విమర్శలు చేస్తోందని ఆరోపించారు. ఇకపై చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు చేస్తే కారుపై బాంబు వేస్తానంటూ రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఇకపోతే మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సైతం టీడీపీపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పట్టాభి మంగళగిరిలో ఆ వ్యాఖ్యలు చేశాడు కాబట్టి రాళ్ల దాడి జరిగిందని అదే సీమలో జరిగి ఉంటే ఖూనీలే జరిగేవంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News