కేసీఆర్‌ను ఆ విషయంలో ఎదుర్కొనే సత్తా నాకు లేదు: ఈటల

దిశ, కమలాపూర్: పెన్షన్లు, రేషన్ కార్డులు రాకపోవడానికి కారణం కేసీఆర్ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లి గ్రామంలో మంగళవారం ప్రజా దీవెన పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..  ఉద్యోగాల కోసం కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయని, కూలీకి పోలేక, తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, బరిగీసి కొట్లాడుదాం కానీ.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకున్నారు. కేసీఆర్ 100ల […]

Update: 2021-07-27 07:32 GMT

దిశ, కమలాపూర్: పెన్షన్లు, రేషన్ కార్డులు రాకపోవడానికి కారణం కేసీఆర్ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లి గ్రామంలో మంగళవారం ప్రజా దీవెన పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయని, కూలీకి పోలేక, తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, బరిగీసి కొట్లాడుదాం కానీ.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకున్నారు.

కేసీఆర్ 100ల కోట్లను ఎదుర్కొనే సత్తా తనకు లేదని, ఆ సత్తా కేవలం ప్రజలకే ఉందని అందుకోసం పాదయాత్ర చేస్తూ మీ ముందుకు వచ్చాను అని అన్నారు. అంతేకాకుండా దళితులతో పాటు సంచార జాతుల వారికి 10 లక్షల రూపాయల దళిత బంధు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఉప ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈటల కోరారు.

Tags:    

Similar News