బెస్ట్ సెల్లర్‌గా హ్యూండాయ్ క్రెటా!
దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ కార్ల కంపెనీ హ్యూండాయ్ మోటార్ ఇండియా మే నెలలో మార్కెట్లో విడుదల చేసిన క్రెటా కొత్త వెర్షన్ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో బెస్ట్ మోడల్‌గా నిలిచింది. క్రెటా మోడల్ మే నెలలో 3,212 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానానికి చేరుకుంది. కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన బెస్ట్ సెల్లర్ ఆల్టో, డిజైర్ మోడళ్లను దాటి క్రెటా మోడల్ దూసుకెళ్లిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. క్రెటా తర్వాత మారుతీ సుజుకి ఎర్టిగా మోడల్ […]
దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ కార్ల కంపెనీ హ్యూండాయ్ మోటార్ ఇండియా మే నెలలో మార్కెట్లో విడుదల చేసిన క్రెటా కొత్త వెర్షన్ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో బెస్ట్ మోడల్‌గా నిలిచింది. క్రెటా మోడల్ మే నెలలో 3,212 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానానికి చేరుకుంది. కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన బెస్ట్ సెల్లర్ ఆల్టో, డిజైర్ మోడళ్లను దాటి క్రెటా మోడల్ దూసుకెళ్లిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. క్రెటా తర్వాత మారుతీ సుజుకి ఎర్టిగా మోడల్ 2,353 యూనిట్లను విక్రయించి రెండో స్థానంలో నిలవగా, మారుతీకే చెందిన డిజైర్ మోడల్ 2,215 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన బెస్ట్ మోడల్ బొలెరో 1,715 యూనింట్లను విక్రయించగలిగింది. ఐదో స్థానంలో మారుతీ మరో మోడల్ మల్టీ వెహికల్ ఎకో మోడల్ 1,617 యూనిట్లను విక్రయించగలిగింది.