ఫోన్ లోనే కరోనా టెస్ట్
దిశ వెబ్ డెస్క్ : కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. దీనికి మందు లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు దృష్టి పెట్టాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు,సూచనలు చేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా లక్షణాలు బయటపడితే.. వెంటనే ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నాయి. జ్వరం,నీరసం,పొడి దగ్గు.. వీటిని కరోనా లక్షణాలుగా చెబుతున్నారు. క్రమంగా వీటి తీవ్రత పెరగవచ్చు. వైరస్ సోకిన ఐదు రోజుల తర్వాత ఈ […]
దిశ వెబ్ డెస్క్ :
కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. దీనికి మందు లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు దృష్టి పెట్టాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు,సూచనలు చేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా లక్షణాలు బయటపడితే.. వెంటనే ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నాయి. జ్వరం,నీరసం,పొడి దగ్గు.. వీటిని కరోనా లక్షణాలుగా చెబుతున్నారు. క్రమంగా వీటి తీవ్రత పెరగవచ్చు. వైరస్ సోకిన ఐదు రోజుల తర్వాత ఈ లక్షణాలు బయటపడుతాయి. సాధారణంగా రెండు నుంచి 14 రోజుల పాటు వీటి లక్షణాలు కనిపించవచ్చు. వైరస్ లక్షణాల్లో దగ్గు ప్రధానమంది. మరి ఆ వైరస్ కారణంగానే దగ్గు వస్తుందని గుర్తించడం ఎలా? అందుకోసం ఆసుపత్రికి వెళ్లాలా? ఇక ముందు ఆ అవసరం లేదు. ఎందుకంటే.. మన మొబైల్ లోనే అది వైరస్ వల్ల వచ్చిన దగ్గు కాదో నిర్ధారణ చేయవచ్చు.
జ్వరం, నీరసం, పొడి దగ్గు, గొంతునొప్పి.. వీటిని కరోనా లక్షణాలుగా చెబుతున్నారు. ఒకవేళ ఈ లక్షణాలు మనలో కనిపిస్తే.. వెంటనే ఆసుపత్రికి రావాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ ను గుర్తించేందుకు లక్షణాల ఆధారంగా రక్తం, కఫం నమూనాలు సేకరించి విశ్లేషిస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం ఎలాంటి పరీక్షలు అందుబాటులో లేవు. అయితే కోవిడ్ 19 లక్షణాల్లో దగ్గు ప్రధానమైంది. స్మార్ట్ ఫోన్ లో దగ్గును రికార్డు చేసి.. వ్యాధి సోకిందో లేదో గుర్తించేందుకు హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ డాక్టుర్నల్ ( docturnal) ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేస్తోంది. దగ్గును రికార్డు చేయడంతో పాటు, ఇతర లక్షణాలను యాప్ లో నమోదు చేసి వ్యాధిని గుర్తిస్తారు. నెల రోజుల్లో ఈ సాఫ్ట్ వేర్ మనకు అందుబాటులోకి రానుంది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సూచనల మేరకు డాక్టుర్నల్ ఈ యాప్ ను రూపొందిస్తుంది.
Tags: corona virus, covid19, docturnal, app, smartphone, cough