‘దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్’

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, ఏపీ బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి హైదరాబాద్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచంలోనే మోస్ట్ మాడరేట్ సిటీ హైదరాబాద్ అని, అత్యధికంగా ఆదాయం వచ్చే సిటీ కూడా అని అన్నారు. అంతేగాకుండా భవిష్యత్తులో హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అయ్యే అవకాశముందని జోస్యం చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని కేసీఆర్ కుటుంబం మింగేస్తుందని మండిపడ్డారు. వరద బాధితులకు ఇచ్చే రూ.10వేల […]

Update: 2020-11-25 07:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, ఏపీ బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి హైదరాబాద్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచంలోనే మోస్ట్ మాడరేట్ సిటీ హైదరాబాద్ అని, అత్యధికంగా ఆదాయం వచ్చే సిటీ కూడా అని అన్నారు. అంతేగాకుండా భవిష్యత్తులో హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అయ్యే అవకాశముందని జోస్యం చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని కేసీఆర్ కుటుంబం మింగేస్తుందని మండిపడ్డారు. వరద బాధితులకు ఇచ్చే రూ.10వేల ఆర్థికసాయం, నేరుగా వారి అకౌంట్లలో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఎప్పటికైనా గ్రేటర్ హైదరాబాద్‌ను గ్రేట్ హైదరాబాద్‌గా మార్చేది బీజేపీనే అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News