CNG MP: రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం

పార్లమెంట్‌(Parliament)లో ప్రజల గొంతును కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) వినిపిస్తున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు.

Update: 2024-12-24 12:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌(Parliament)లో ప్రజల గొంతును కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) వినిపిస్తున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు. రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌కు అవమానం జరిగితే, దేశ ప్రజలందరికీ జరిగినట్లేనని అన్నారు.

అమిత్ షాను కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని.. లేకపోతే అమిత్ షా(Ambedkar) వ్యాఖ్యలను మోడీ కూడా సమర్థించినట్లే అని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన మోడీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్​ కంపెనీల చేతుల్లో పెట్టి, సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి కులం, మతం, ప్రాంతం, దేవుడు, దేశభక్తి పేరుతో తినే తిండిపై ఆంక్షలు విధిస్తూ ప్రజలను రెచ్చగొట్టి ప్రణాళిక ప్రకారం హింసను ప్రేరేపిస్తుందని విమర్శించారు.

Tags:    

Similar News