30 కోట్ల టీకా డోసుల ఒప్పందం.. రూ. 1,500 కోట్లు అడ్వాన్స్
న్యూఢిల్లీ: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థ, కేంద్ర ప్రభుత్వం మధ్య టీకా ఒప్పందం కుదిరింది. 30 కోట్ల టీకా డోసులను ప్రభుత్వానికి సరఫరా చేయడానికి సంస్థ ఒప్పుకుంది. ఈ సంస్థకు రూ. 1,500 కోట్లు అడ్వాన్స్ పేమెంట్ చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఈ టీకాల ఉత్పత్తి, సరఫరాలు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. బయోలాజికల్ ఈ సంస్థ ఆర్‌బీడీ ప్రొటీన్ సబ్ యూనిట్ […]
న్యూఢిల్లీ: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థ, కేంద్ర ప్రభుత్వం మధ్య టీకా ఒప్పందం కుదిరింది. 30 కోట్ల టీకా డోసులను ప్రభుత్వానికి సరఫరా చేయడానికి సంస్థ ఒప్పుకుంది. ఈ సంస్థకు రూ. 1,500 కోట్లు అడ్వాన్స్ పేమెంట్ చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఈ టీకాల ఉత్పత్తి, సరఫరాలు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. బయోలాజికల్ ఈ సంస్థ ఆర్‌బీడీ ప్రొటీన్ సబ్ యూనిట్ టెక్నాలజీతో టీకాను అభివృద్ధి చేస్తు్న్నది. మరికొన్ని నెలల్లో ఈ టీకా అందుబాటులోకి రానుంది. మొదటి, రెండో క్లినికల్ ట్రయల్స్‌లో ఉత్తేజకర ఫలితాలు వెలువరించిన ఈ టీకా మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి.
టీకా ఒప్పంద ప్రతిపాదనను టీకా పంపిణీపై నిపుణుల బృందం పరిశీలించి, ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌లోపు దేశ ప్రజలందరికీ టీకా వేస్తామని కేంద్రం ప్రకటించిన రోజుల వ్యవధిల ఈ ఒప్పంద కుదరడం గమనార్హం. అన్నీ అనుకున్నట్టు జరిగితే వ్యాక్సినేషన్‌కు అనుమతి పొందిన రెండో దేశీయ టీకాగా బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ నిలవనుంది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు. బయోలాజికల్ ఈ టీకా రెండోదిగా నిలవనుంది. ఈ రెండు టీకాలు హైదరాబాద్‌వే కానుండటం విశేషం.