‘పెనిమిటీ’.. ఇది ఏమిటీ!

దిశ, నిజామాబాద్: జిల్లా మున్సిపల్ కార్పొరేషన్‌లో మహిళా కార్పొరేటర్ల భర్తలు, కొడుకులదే హవా నడుస్తోంది. వరంగల్ తర్వాత పెద్దదైన ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో మహిళా కార్పొరేటర్ల స్థానంలో వారీ కుటుంబీకులు ఇంచార్జి కార్పొరేటర్లుగా చలామణి అవుతున్నారు. మొత్తం 60 డివిజన్లలో మేయర్‌తో సహా 30 మంది మహిళా కార్పొరేటర్లు ఎన్నికవ్వగా.. పెత్తనమంత వారి భర్తలు, కొడుకులే చూసుకుంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలు మినహా ప్రతిచోట వారే కార్పొరేటర్లుగా అధికారం చలాయిస్తున్నారు. పాలకవర్గం ఏర్పడి ఇప్పటికీ 40 రోజులు […]

Update: 2020-03-03 04:02 GMT

దిశ, నిజామాబాద్: జిల్లా మున్సిపల్ కార్పొరేషన్‌లో మహిళా కార్పొరేటర్ల భర్తలు, కొడుకులదే హవా నడుస్తోంది. వరంగల్ తర్వాత పెద్దదైన ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో మహిళా కార్పొరేటర్ల స్థానంలో వారీ కుటుంబీకులు ఇంచార్జి కార్పొరేటర్లుగా చలామణి అవుతున్నారు. మొత్తం 60 డివిజన్లలో మేయర్‌తో సహా 30 మంది మహిళా కార్పొరేటర్లు ఎన్నికవ్వగా.. పెత్తనమంత వారి భర్తలు, కొడుకులే చూసుకుంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలు మినహా ప్రతిచోట వారే కార్పొరేటర్లుగా అధికారం చలాయిస్తున్నారు. పాలకవర్గం ఏర్పడి ఇప్పటికీ 40 రోజులు గడిచినా ఇంకా సగమంది మహిళా కార్పొరేటర్లు ఎలా ఉంటారో తెలియదని పలువురు కార్పొరేషన్ ఉద్యోగులు చెబుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రాజ్యాంగ హక్కులతో స్థానిక సంస్థల్లో సగానికి సగం మహిళలకు స్థానాలను కేటాయిస్తే వారికి పదవులు రెండ్రోజుల మురిపెంగానే మిగిలాయి. మహిళా కార్పొరేటర్లను కొన్ని డివిజన్లలో వంటింటికే పరిమితం చేయగా మరికొన్ని ప్రాంతాల్లో అధికారిక కార్యక్రమాలకు వెళ్లనీవకుండా భర్తలు, కొడుకులే హాజరవుతున్నారు. తాము రాజకీయంగా ఎదిగే క్రమంలో రిజర్వేషన్లు మహిళలకు రావడంతో వారిని బరిలో నిలిపి గెలిపించుకున్నామని… ఇప్పుడు పెత్తనమంత తమదే అని టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతలు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. తెలంగాణలో పితృస్వామ్య వ్యవస్థ ఉండగా ఇక్కడ మాత్రం భార్యల పేరుతో భర్తల పేర్లను ఉచ్చరించాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి.

గతంలో మహిళలు రాజకీయంగా ఎదగలేని వారికి కుటుంబసభ్యులు సాయం అందించేవారు. కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మహిళలను వెనక్కినెట్టి వారి కుటుంబీకులే ఇంచార్జి కార్పొరేటర్లుగా అధికారం చలాయిస్తున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత ఐఏఎస్ అధికారి జితేష్ వి పాటిల్‌‌ను కమిషనర్‌గా నియమించినప్పటికీ పరిస్థితుల్లో ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. ఈక్రమంలోనే కార్పొరేషన్ కార్యాలయం తీసుకునే నిర్ణయాలు మొదలుకొని వాటి అమలు వరకు మహిళా కార్పొరేటర్ల భర్తలు, కొడుకులే ముందుడి నడిపిస్తూ హవా చేస్తున్నారు.

Tags:    

Similar News