మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి విచారానికి గురయ్యా: సీఎం చంద్రబాబు

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు....

Update: 2024-12-27 03:43 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. 'భారత మాజీ ప్రధాని, పేరెన్నికగన్న ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యాను. మేధావి, రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతి రూపం. కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్య్రం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. దేశానికి రెండు సార్లు ప్రధానిగా ఆయన పని చేశారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రం అమిత్ షా నివాళులర్పించారు. దేశంలో 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్రప్రభుత్వం అధికారిక లాంఛనాలతో  శనివారం నిర్వహించనుంది. కాంగ్రెస్ పార్టీ 7 రోజుల పాటు అన్ని కార్యక్రమాలను రద్దు చేసింది. 

Tags:    

Similar News