భార్యకు బొద్దికలంటే భయం.. విడాకులకు సిద్దమైన భర్త..

దిశ, వెబ్ డెస్క్ : మాములుగా ఆడవాళ్ళలో కొందరికి బొద్దింకలంటే భయం ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఓ భర్త తన భార్యకు బొద్దికాలంటే భయమని విడాకులు ఇవ్వడానికి సిద్దమయ్యాడు. అసలు విషయానికి వస్తే… మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ జంటకు 2017లో వివాహం జరిగింది. ఓ రోజు వంటగది నుండి కేకలు వినిపించాయి. వెంటనే కిచెన్ లోకి వెళ్లిన భర్తకు నాకు బొద్దింకలు అంటే భయం అని భార్య చెప్పింది. అంతేకాకుండా ఆ కిచెన్ […]

Update: 2021-04-16 12:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : మాములుగా ఆడవాళ్ళలో కొందరికి బొద్దింకలంటే భయం ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఓ భర్త తన భార్యకు బొద్దికాలంటే భయమని విడాకులు ఇవ్వడానికి సిద్దమయ్యాడు. అసలు విషయానికి వస్తే… మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ జంటకు 2017లో వివాహం జరిగింది. ఓ రోజు వంటగది నుండి కేకలు వినిపించాయి. వెంటనే కిచెన్ లోకి వెళ్లిన భర్తకు నాకు బొద్దింకలు అంటే భయం అని భార్య చెప్పింది. అంతేకాకుండా ఆ కిచెన్ లోకి వెళ్ళేదెలేదని చెప్పి వేరే ఇల్లు మార్పిచింది. ఇదే తంతూ 18 ఇండ్లు మారేలా చేసింది. దీంతో విసుగొచ్చిన భర్త ఆమెను మానసిక వైద్యులకు కూడా చూపించాడు. ఆ వైద్యులు ఇచ్చిన మందులు వాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కలుగకపోగా.. తన భర్త తనను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నాడని ఆరోపించింది. దీంతో భర్త విడాకులు కావాలని కోర్టుకెక్కాడు.

Tags:    

Similar News