భార్య మృతదేహంతోనే భర్త సహజీవనం

దిశ, వెబ్ డెస్క్: భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం గురించి ఎంత వివరించినా తక్కువే. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతలా ఉంటదో అనేది మనం ఎన్నో సందర్భాల్లో చూసిన విషయం తెలిసిందే. ఆనందంలో.. అనుబంధంలోనే కాదు.. విషాదంలో కూడా వారిది విడదీయరాని బంధం. ఇందుకు చాలా ఉదాహరణలు మనం చూసిన సంగతి తెలిసిందే. చెన్నైలో తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది. భార్య మీద భర్త పెంచుకున్న ప్రేమానురాగాలను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. భార్య […]

Update: 2020-08-25 02:27 GMT

దిశ, వెబ్ డెస్క్: భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం గురించి ఎంత వివరించినా తక్కువే. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతలా ఉంటదో అనేది మనం ఎన్నో సందర్భాల్లో చూసిన విషయం తెలిసిందే. ఆనందంలో.. అనుబంధంలోనే కాదు.. విషాదంలో కూడా వారిది విడదీయరాని బంధం. ఇందుకు చాలా ఉదాహరణలు మనం చూసిన సంగతి తెలిసిందే. చెన్నైలో తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది. భార్య మీద భర్త పెంచుకున్న ప్రేమానురాగాలను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. భార్య చనిపోయినా కూడా అతను భార్య మృతదేహంతోనే కొన్ని రోజుల నుంచి సహజీవనం చేస్తున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పొన్నియన్, మలైతమ్మాల్ దంపతులిద్దరు చెన్నైలోని కోడిస్టయుర్ లో నివాసముంటున్నారు. అయితే, మలైతమ్మాల్ ఇటీవల చనిపోయింది. తన భార్యమీద ఉన్న ప్రేమతో అప్పటి నుంచి భార్య మృతదేహంతోనే సహజీవనం చేస్తున్నాడు. మృతదేహం కుళ్లిపోయి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పొన్నియన్ ను ఆస్పత్రికి తరలించారు. మలైతమ్మాల్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

Tags:    

Similar News