భార్య నగ్న చిత్రాలతో భర్త వ్యాపారం!

దిశ, వెబ్‌డెస్క్ : భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త కంత్రీ పనులకు తెగపడ్డాడు. కలిసి సంసారం చేశామన్న సంస్కారం కూడా లేకుండా నీచంగా ప్రవర్తించాడు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన రహస్యాలను నలుగురిలో పెడతానని బ్లాక్ మెయిల్ కు దిగాడు. అప్పటికే అతడి వేదింపులకు తట్టుకోలేని భార్య.. పోలీసులను ఆశ్రయించింది. గుంటూరు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాలుగేండ్ల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన యువకుడితో ప్రకాశం జిల్లాకు […]

Update: 2020-12-29 11:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త కంత్రీ పనులకు తెగపడ్డాడు. కలిసి సంసారం చేశామన్న సంస్కారం కూడా లేకుండా నీచంగా ప్రవర్తించాడు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన రహస్యాలను నలుగురిలో పెడతానని బ్లాక్ మెయిల్ కు దిగాడు. అప్పటికే అతడి వేదింపులకు తట్టుకోలేని భార్య.. పోలీసులను ఆశ్రయించింది. గుంటూరు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నాలుగేండ్ల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన యువకుడితో ప్రకాశం జిల్లాకు చెందిన యువతికి వివాహం అయింది. పెళ్లి సమయంతో రూ.10 లక్షల విలువైన ఇంటిస్థలం, ఐదు సవర్ల బంగారం, లక్ష రూపాయల నగదు, ఇంటి సామాన్లు ఇచ్చారు. పెళ్లై.. పాప పుట్టే వరకు బాగానే చూసుకున్న అత్తింటి వారు.. ఆ తర్వాత అదనపు కట్నం తేవాలని వేదింపులకు గురిచేశారు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయినా భర్తలో మార్పు రాకపోవడంతో సంవత్సరం తర్వాత భరణం కేసు వేసింది.

అయితే తనపై పెట్టిన కేసులు వాపస్ తీసుకోవాలని భార్య తరుఫు బంధువులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు భర్త. ప్రైవేట్ టెలికాం రంగంలో పని చేస్తున్న తన మిత్రుల ద్వారా భార్య ఫోన్ ట్యాపింగ్ చేయించి.. ఆ వాయిస్ రికార్డులను బంధువులకు పంపుతున్నాడు. వాటితో ఆగక భార్య నగ్న వీడియోలను ఇంటర్ నెట్‌లో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీనిపై ఆందోళన చెందిన భార్య గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తన భర్త, ఆడపడుచుతోపాటు ఆయనకు సహకరించిన ప్రైవేట్ టెలికాం ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరింది.

 

Tags:    

Similar News