ప్రపంచంలోనే అతి చిన్న ఆవు.. చూడ్డానికి క్యూ కడుతున్న జనాలు!

దిశ, ఫీచర్స్ : పల్లెల్లో ఆవులు, గేదెలు, కోళ్లను పెంచుకోవడం పరిపాటే. దాదాపు ప్రతి ఇంట్లోనూ వాటి సందడి కనిపిస్తోంది. ఇక తమ ఆవుకు దూడ పుడితే ఇంట్లో పండగే. చెంగుచెంగున దుమికే ఆ లేగదూడను చూస్తే మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోతుంది. బుజ్జి లేగదూడ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. అలాంటిది మరి ప్రపంచంలోనే చిట్టిపొట్టి లేగదూడైతే.. ఇంకేముంది ఊరుఊరంతా దాన్ని చూడ్డానికి క్యూ కట్టేస్తారు. భారత్ పొరుగు దేశం ‘బంగ్లాదేశ్’‌లో […]

Update: 2021-07-13 02:58 GMT

దిశ, ఫీచర్స్ : పల్లెల్లో ఆవులు, గేదెలు, కోళ్లను పెంచుకోవడం పరిపాటే. దాదాపు ప్రతి ఇంట్లోనూ వాటి సందడి కనిపిస్తోంది. ఇక తమ ఆవుకు దూడ పుడితే ఇంట్లో పండగే. చెంగుచెంగున దుమికే ఆ లేగదూడను చూస్తే మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోతుంది. బుజ్జి లేగదూడ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. అలాంటిది మరి ప్రపంచంలోనే చిట్టిపొట్టి లేగదూడైతే.. ఇంకేముంది ఊరుఊరంతా దాన్ని చూడ్డానికి క్యూ కట్టేస్తారు. భారత్ పొరుగు దేశం ‘బంగ్లాదేశ్’‌లో ఆ చిత్రమే కనిపిస్తోంది. రాణిని చూడ్డానికి, దాంతో ఫొటోలు దిగడానికి జనాలు ఉవ్విళ్లూరుతున్నారు. రెండు సంవత్సరాల ఓ లేగదూడ అతి తక్కువ ఎత్తుతో వరల్డ్ స్మాలెస్ట్ కౌ‌గా నిలిచింది. ఆ రాణి విశేషాలు మీకోసం..

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ‘రాణి’ ఓ సెలబ్రిటీ. ఈ భూటాన్ జాతి ఆవు ఎత్తు కేవలం 51 సెం.మీ, బరువు 26 కిలోలు. ఈ బుజ్జి లేగను చేతిలో ఎత్తుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఢాకాకు దగ్గర్లో ఉన్న చారీగ్రామ్‌లోని సలీం‌కు చెందిన ఫామ్ హౌస్‌లో ఉంది. దీని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు కరోనా నిబంధనలు ఉల్లఘించి మరి దీన్ని చూడ్డానికి వస్తున్నారు. అంతేకాదు ‘రాణి ఈజ్ వెరీ క్యూట్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ దూడ రోజులో కేవలం 200గ్రాముల గడ్డి మాత్రమే తింటుంది. బంగ్లాదేశ్‌లోని నౌగావ్ జిల్లాలోని ఒక ఫామ్ నుంచి కిందటి ఏడాది దీన్ని సలీం తాతయ్య హసన్ హోలాదార్ తీసుకువచ్చాడు. ‘ప్రపంచంలోనే అతిచిన్న ఆవుగా గుర్తించాలని గిన్నిస్ నిర్వాహకులకు లేఖ రాశాం. 90రోజుల తర్వాత రిప్లయ్ అందించారు. గిన్నిస్ బృందం రాణిని చూసి, స్మాలెస్ట్ కౌ అనే గుర్తింపు రాణికి ఇవ్వాలో వద్దో అని నిర్ధారించుకున్న తర్వాత అధికారికంగా ప్రకటిస్తామన్నారు’ అని ఫార్మ్ డైరెక్టర్ మొహమ్మద్ సలీం తెలిపాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో అతి చిన్న ఆవుగా భారత దేశానికి చెందిన ‘మాణిక్యం’ గుర్తింపు పొందింది. కేరళలో ఉన్న ఈ ఆవు ఎత్తు 61.1 సెం.మీ. మాత్రమే.

Tags:    

Similar News