భారత్‌లో కొరియా పెట్టుబడులకు ప్రభుత్వ ఆహ్వానం!

దిశ, వెబ్‌డెస్క్: భారత ఎకోసిస్టమ్‌లో కొరియా పెట్టుబడిదారులకు భారీ అవకాశాలు ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమల మత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగుపడేందుకు ఆటోమొబైల్, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్ వంటి రంగాల్లో సహకరించుకోవాల్సిన అవసరం ఉందని శుక్రవారం ఓ ప్రకటనలో అన్నారు. ఇండియా-కొరియా బిజినెస్ ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని కొరియా వ్యాపారులను వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆహ్వానించారు. ‘కొరియా పెట్టుబడిదారుల, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లకు భారత్‌లోని […]

Update: 2021-11-12 08:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ఎకోసిస్టమ్‌లో కొరియా పెట్టుబడిదారులకు భారీ అవకాశాలు ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమల మత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగుపడేందుకు ఆటోమొబైల్, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్ వంటి రంగాల్లో సహకరించుకోవాల్సిన అవసరం ఉందని శుక్రవారం ఓ ప్రకటనలో అన్నారు. ఇండియా-కొరియా బిజినెస్ ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని కొరియా వ్యాపారులను వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆహ్వానించారు. ‘కొరియా పెట్టుబడిదారుల, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లకు భారత్‌లోని స్టార్టప్ విభాగంలో భారీ అవకాశాలుంటాయనే నమ్మకం ఉందన్నారు.

ముఖ్యంగా ఆటోమొబైల్, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మెటల్, మైనింగ్, కెమికల్స్ సహా భారత్ సాంప్రదాయ ఉక్కు రంగంలో వృద్ధి అవకాశాలు గణనీయంగా ఉన్నాయని’ పీయుష్ గోయల్ అన్నారు. ప్రభుత్వం ఇటీవల ట్రిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులతో జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ ప్రారంభించిందని, ఇది కంపెనీలకు మెరుగైన అవకాశాలను అందించగలదని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా ఉందని ఎగుమతులు భారీగా పెరిగాయన్నారు. ఆర్థికవ్యవస్థ సైతం వేగంగా పుంజుకుంటోందని ఆయన పేర్కొన్నారు. కాగా, భారత్‌లో 15 వేల మంది కొరియన్లు స్థిరంగా ఉన్నారని, 12 వేల మంది భారతీయులు కొరియాలో నివశిస్తున్నారని పీయుష్ గోయల్ వెల్లడించారు.

Tags:    

Similar News