ఒమిక్రాన్ ఇన్ ఇండియా.. మళ్లీ గుండెల్లో గుబులు! 

దిశ, ఫీచర్స్ : కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అది కాస్త తగ్గడంతో ఊపిరి పీల్చుకునే సమయంలో డెల్టా వేరియంట్ వచ్చి మరింత దిక్కుతోచని పరిస్థితులను నెలకొల్పింది. ఆ తర్వాత డెల్టా వేరియంట్ కేసులు తగ్గుముఖం పట్టడంతో, మహమ్మారి కారణంగా ఏర్పడిన దీర్ఘకాలిక అనిశ్చితి, ఆందోళన నుంచి జనం మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలతో పాటు పబ్లిక్ ప్లేసులు సైతం జనాలతో సందడిగా మారాయి. దీంతో మళ్లీ సాధారణ పరిస్థితుల్లోకి వస్తున్నామని […]

Update: 2021-12-04 03:19 GMT

దిశ, ఫీచర్స్ : కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అది కాస్త తగ్గడంతో ఊపిరి పీల్చుకునే సమయంలో డెల్టా వేరియంట్ వచ్చి మరింత దిక్కుతోచని పరిస్థితులను నెలకొల్పింది. ఆ తర్వాత డెల్టా వేరియంట్ కేసులు తగ్గుముఖం పట్టడంతో, మహమ్మారి కారణంగా ఏర్పడిన దీర్ఘకాలిక అనిశ్చితి, ఆందోళన నుంచి జనం మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలతో పాటు పబ్లిక్ ప్లేసులు సైతం జనాలతో సందడిగా మారాయి. దీంతో మళ్లీ సాధారణ పరిస్థితుల్లోకి వస్తున్నామని అందరూ సంతోషిస్తున్నారు.

ఇంతలో న్యూ కోవిడ్-19 వేరియంట్ ‘ఒమిక్రాన్’ మరోసారి అందరి గుండెల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. ఇది డెల్టా కంటే మరింత ప్రమాదకరమైందని మీడియా, సోషల్ మీడియా ప్రచారం చేయడంతో భవిష్యత్తు గురించి మరోసారి ఆందోళన ఏర్పడుతోంది. ఇలాంటి తరుణంలో యాంగ్జయిటీని ఎదుర్కొనే విధానాన్ని న్యూ ఢిల్లీకి చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ నేహా దత్ వివరించారు.

పరిస్థితుల్లో లేదా పరిసరాల్లో ఏదైనా ఊహించని పరివర్తన మనలో కొంత అసౌకర్యాన్ని కలిగించడంతో పాటు మన ప్రవర్తనా విధానాలను ప్రభావితం చేస్తుంది. దీంతో ప్రతికూల ఆలోచనలు, ఆందోళన పెరగడం సహజం. దీనికి చెక్ పెట్టేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలి. అభిరుచులపై దృష్టి సారిస్తూ, ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించే పనులు చేయాలి. వాటితో పాటుగా..

నిద్ర నియంత్రణ

* పడుకునేందుకు, మేల్కొనేందుకు ఒక నిర్దిష్ట సమయాన్ని షెడ్యూల్ చేసుకోవాలి.

* పగటి నిద్రలకు దూరంగా ఉండాలి

*సాయంత్రం 5 తర్వాత కెఫిన్(టీ, కాఫీ) తీసుకోవడం మానుకోండి.

*పడుకునే ముందు ఫోన్ స్క్రీన్ ఎక్స్‌పోజర్/వినియోగాన్ని ఆపాలి

* రాత్రిపూట మితమైన ఆహారం లేదా సాత్విక ఆహారం తీసుకోవాలి. కడుపు వీలైనంత ఖాళీగా ఉండాలి

* పడుకునే ముందు నీళ్లు తాగకపోవడమే ఉత్తమం.

సమయం నిర్వహణ

* స్మార్ట్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

* చేయవలసిన పనుల జాబితాను షెడ్యూల్ చేసుకోవాలి

* పనులకు డెడ్‌లైన్స్ సెట్ చేసుకోవాలి

* కంట్రోల్డ్ బ్రేక్స్ తీసుకోవాలి

* డి-క్లట్టరింగ్ రొటీన్‌ను ప్రాక్టీస్ చేయాలి

వెంటిలేట్

* అశాంతిని కలిగించే విషయాలను సన్నిహితంగా, విశ్వసనీయంగా ఉన్న వారితో పంచుకోవడం వల్ల సదరు సమస్య నుంచి చాలావరకు రిలీఫ్ పొందే అవకాశముంటుంది.

* మీరు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు ఇతర పనుల వైపు దాన్ని డైవర్డ్ చేయాలి. ఉదాహరణకు రివర్స్ కౌంట్.. 20 నుంచి 10కి లెక్కవేయడం, పజిల్స్ పూర్తి చేయడం, గార్డెనింగ్ వంటివి చేయాలి.

శారీరక వ్యాయామాలు

* నిత్యం వ్యాయామాలు చేస్తుంటే మన శరీరం సహజంగానే హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది.

* అప్డేట్స్ కోసం వార్తలను చదవడం పరిమితం చేయండి. సోషల్ మీడియాకు వీలైనంత దూరం ఉండటంతో పాటు అందులో స్ప్రెడ్ అయ్యే వార్తలను, రూఢీ చేసుకున్న తర్వాతే నమ్మాలి. ఒక్కోసారి ఎన్ని చేసినా ఆందోళన నుంచి బయటపడలేం అలాంటి సందర్భాల్లో వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.

రాచకొండ జోన్ పరిధిలో మాస్క్ ధరించని వారిపై కొరడా.. లక్ష దాటిన కేసులు..

Tags:    

Similar News