ఇన్‌స్టా తరహాలో ‘ఎఫ్‌బీ రీల్స్’

దిశ, ఫీచర్స్ : ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ కావడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నో యాప్స్ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్.. ‘ఫాస్ట్ లాఫ్స్’‌ పేరుతో టిక్ టాక్‌ను పోలిన యాప్‌ను తీసుకురాగా, ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చిన ‘రీల్స్’ ఫీచర్ కూడా చాలా పాపులర్ అయింది. కాగా ప్రస్తుతం ఫేస్‌బుక్ కూడా అదే ఫీచర్‌ను తమ యూజర్ల కోసం ప్రవేశపెడుతోంది. దీంతో ఫేస్‌బుక్‌ యూజర్లు కూడా ఇకపై […]

Update: 2021-03-10 03:38 GMT

దిశ, ఫీచర్స్ : ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ కావడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నో యాప్స్ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్.. ‘ఫాస్ట్ లాఫ్స్’‌ పేరుతో టిక్ టాక్‌ను పోలిన యాప్‌ను తీసుకురాగా, ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చిన ‘రీల్స్’ ఫీచర్ కూడా చాలా పాపులర్ అయింది. కాగా ప్రస్తుతం ఫేస్‌బుక్ కూడా అదే ఫీచర్‌ను తమ యూజర్ల కోసం ప్రవేశపెడుతోంది. దీంతో ఫేస్‌బుక్‌ యూజర్లు కూడా ఇకపై షార్ట్ వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు.

ఏడాది నుంచి టిక్‌టాక్ తరహా షార్ట్ ఫామ్ వీడియోలను టెస్ట్ చేస్తున్న ఫేస్‌బుక్.. ఇండియాలోని కంటెంట్ క్రియేటర్ల కోసమే ఈ షార్ట్ వీడియో ఫీచర్‌ను అధికారికంగా లాంచ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ ఫీచర్‌ను కూడా ‘రీల్స్’ అనే పిలుస్తుండగా, యూజర్లు న్యూస్ ఫీడ్‌లో చిన్న వీడియో క్లిప్‌లను సృష్టించుకోవడంతో పాటు వాటిని ఇతరులతో పంచుకోవచ్చు. ప్రస్తుతానికి ఇండియా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

ఎలా క్రియేట్ చేయాలంటే..

ఫేస్‌బుక్ టాప్‌లో న్యూస్ ఫీడ్ ట్యాబ్ దగ్గర ‘సెలక్ట్ రీల్స్’ లేదా షార్ట్ వీడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్రియేట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. 10 సెకన్ల నుంచి 15 సెకన్ల వరకు షార్ట్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. అంతకుమించి రికార్డ్ చేసిన వీడియోను ట్రిమ్, ఎడిట్ చేసుకునే అవకాశం ఉండటంతో పాటు వాటికి మ్యూజిక్, ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎఫ్‌బీ అగ్మెంటెడ్ రియాలిటీ లైబ్రరీ నుంచి ఏఆర్ ఎఫెక్ట్స్ కూడా వాడుకోవచ్చు. వీడియో స్పీడ్‌ (స్టో మోషన్ లేదా ఫాస్ట్ ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. రీల్స్ పూర్తి కాగానే న్యూస్ ఫీడ్‌లో కేవలం స్నేహితులు లేదా పబ్లిక్ లేదా కస్టమ్స్ ఆప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News