గ్రేటర్‌లో బీజేపీకి వచ్చే సీట్లు ఎన్ని ?
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల సమయమే మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఈ సమయంలోనే ఓటర్లు ప్రభావితమై ఏపార్టీ వైపు మొగ్గుచూపి, ఎలాంటి రిజల్ట్ ఇస్తారేమోనన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఎవరికి వారు తమకు అనుకూలంగానే లెక్కలు వేసుకుంటున్నా.. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి బీజేపీ టఫ్‌ఫైట్ ఇస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అసలు ఎన్నిసీట్లలో కాషాయం పార్టీ […]
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల సమయమే మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఈ సమయంలోనే ఓటర్లు ప్రభావితమై ఏపార్టీ వైపు మొగ్గుచూపి, ఎలాంటి రిజల్ట్ ఇస్తారేమోనన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఎవరికి వారు తమకు అనుకూలంగానే లెక్కలు వేసుకుంటున్నా.. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి బీజేపీ టఫ్‌ఫైట్ ఇస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అసలు ఎన్నిసీట్లలో కాషాయం పార్టీ గెలుస్తుందన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది.
సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్టు మేరకు బీజేపీకి 50డివిజన్లు, స్టేట్ ఇంటెలిజెన్స్ ప్రకారం 30కి పైగా సీట్లు గెలవబోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కాషాయ పార్టీకి 25నుంచి 30లోపే సీట్లు వస్తాయని అంతకంటే ఎక్కువగా ఊహించుకున్నా ఏం లాభం ఉండదని తేల్చి చెబుతున్నారు. కమలనాథులు మాత్రం 80నుంచి 95సీట్ల మధ్యలో గెలిచి గ్రేటర్‌లో మేయర్ సీటును కైవసం చేసుకోబోతున్నామని ఉత్సాహంగా కామెంట్లు చేస్తున్నారు. ఇదేక్రమంలో టీఆర్ఎస్ కేవలం 30సీట్లకే పరిమితం అవుతుందని, ఎంఐఎంకు సైతం 30నుంచి 35వరకే సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చర్చలు జరుగుతుండటంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.
అటు.. కాంగ్రెస్ సైతం 10సీట్ల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ హస్తం పార్టీ అభ్యర్థులకే మళ్లే అవకాశాలు ఉంటాయన్న లెక్కలు వినపడుతుండటంతో రేపటి పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకున్న పొలిటికల్ లీడర్స్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇదేక్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు వాళ్ల మెండ్ డైవర్ట్ చేయడమే గాక కొత్త ఆశలను కల్పిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రధాన రాజకీయ పార్టీలు గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఓటింగ్ శాతమే మేయర్ ఛైర్‌ను డిసైడ్ చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే.. నిన్న ప్రచారం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మేయర్ పీఠాన్ని బీజేపీనే దక్కించుకుంటుందని వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర ప్రజలతో పాటు బీజేపీ జాతీయ నేతలు కూడా గ్రేటర్ పీఠంపై ఆసక్తి కనబరుస్తున్నారు. సెంట్రల్, స్టేట్ ఇంటెలిజెన్స్ లెక్కల ప్రకారమే బీజేపీ సీట్లు గెలుస్తుందా? లేకుంటే టీఆర్ఎస్ నేతలు చెప్పిన విధంగానే బీజేపీ సీట్లను సాధిస్తుందా? అన్నది కీలకంగా మారింది. ఒకవేళ బీజేపీ నేతల అంచనాలకు వ్యతిరేకంగా సీట్లు వస్తే హంగ్ ఏర్పడే పరిస్థితులు ఉన్నందున.. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ఏం చేస్తాయి? కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్ధతు తెలుపుతారా.. లేకుంటే.. అధికార టీఆర్ఎస్ పార్టీ వైపునకు మొగ్గుచూపుతారా అన్నది ఎన్నికల ఫలితాల రోజు సాయంత్రానికే డిసైడ్ కానుంది.