25 మందితో డేటింగ్ తర్వాత.. పెళ్లి చేసుకున్న హీరో

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, సునీత కపూర్‌ను వివాహమాడి దాదాపు నాలుగు దశాబ్దాలు గడిచిపోయింది. నేడు వారి రెండో కూతురు రియా కపూర్.. తన బాయ్‌ఫ్రెండ్ కరణ్ బూలానీని పెళ్లి చేసుకుంటున్న సందర్భంగా అనిల్-సునీతల లవ్‌స్టోరీ తెరపైకి వచ్చింది. గతేడాది తమ 36వ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్న అనిల్.. సునీతకు ఎలా ప్రపోజ్ చేశాడన్న విషయాన్ని ప్రెస్ ఈవెంట్‌లో వెల్లడించాడు. జీవితంలో స్థిరపడాలని డిసైడ్ అయ్యేందుకు ముందు తనకు ఫిల్మ్ ఇండస్ట్రీ […]

Update: 2021-08-14 05:45 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, సునీత కపూర్‌ను వివాహమాడి దాదాపు నాలుగు దశాబ్దాలు గడిచిపోయింది. నేడు వారి రెండో కూతురు రియా కపూర్.. తన బాయ్‌ఫ్రెండ్ కరణ్ బూలానీని పెళ్లి చేసుకుంటున్న సందర్భంగా అనిల్-సునీతల లవ్‌స్టోరీ తెరపైకి వచ్చింది. గతేడాది తమ 36వ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్న అనిల్.. సునీతకు ఎలా ప్రపోజ్ చేశాడన్న విషయాన్ని ప్రెస్ ఈవెంట్‌లో వెల్లడించాడు. జీవితంలో స్థిరపడాలని డిసైడ్ అయ్యేందుకు ముందు తనకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 20-25 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని తెలిపాడు.

ఇక మరో స్పెషల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తమ లవ్ స్టోరీ ఎలా మొదలైందో చెప్పాడు. ‘మే 17న భారీ కాస్టింగ్‌తో నా కెరీర్‌లోనే ఇంపార్టెంట్ ఫిల్మ్‌కు సైన్ చేశా. ఇక మే 18న అంతకంటే పెద్ద నిర్ణయమే తీసుకున్నా. పెళ్లి చేసుకుందామని నా గర్ల్ ఫ్రెండ్ సునీతకు ప్రపోజ్ చేశాను. సాధారణంగా అందరూ తమ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మేము మా ప్రపోజల్స్‌ను కూడా సెలబ్రేట్ చేసుకుంటాం’ అని చెప్పుకొచ్చాడు. కాగా రియాతో పాటు సోనమ్ కపూర్, హర్షవర్ధన్ కపూర్ కూడా అనిల్ కపూర్ పిల్లలేనన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..