అనుమతి లేని ప్రాజెక్టుకు ఏఐబీపీ నిధులెలా ఇస్తారు- కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి కృషి సంచాయీ యోజన కింద నిధులు కేటాయించే అంశానికి సంబంధించి కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కేంద్రానికి లేఖ రాయడం రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కేంద్ర జల శక్తి శాఖకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు శుక్రవారం లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుకి కృష్ణా ట్రైబ్యునల్‌లో కేటాయింపులు లేవని, కేవలం వరద జలాల ఆధారంగా […]

Update: 2021-08-27 12:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి కృషి సంచాయీ యోజన కింద నిధులు కేటాయించే అంశానికి సంబంధించి కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కేంద్రానికి లేఖ రాయడం రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కేంద్ర జల శక్తి శాఖకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు శుక్రవారం లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుకి కృష్ణా ట్రైబ్యునల్‌లో కేటాయింపులు లేవని, కేవలం వరద జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టుని ఏపీ చేపట్టిందని ఈఎన్సీ లేఖలో వివరించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్ వెలుపలకు నీళ్ళను ఏపీ ప్రభుత్వం తరలిస్తోందని ఆరోపించారు. అనుమతి లేని ప్రాజెక్టుకి ఏఐబీపీ కింద నిధులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ నిధులు కేటాయింపుపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని లేఖలో కోరారు. కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్‌లో కూడ ఈ ప్రాజెక్టును నోటిఫై చేయలేదని తెలంగాణ సర్కార్ గుర్తు చేసింది. అనుమతిలేని ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడం సరైంది కాదని కూడ లేఖలో అభిప్రాయపడ్డారు.

వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా ట్రైబ్యునల్‌‌లో కేటాయింపులు లేవని మరోసారి గుర్తు చేశారు. వెలిగొండకు అనుమతులు లేవన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌ వెలుపలకు నీరు తరలిస్తున్నారని, ఈ అంశంపై గతంలోనే ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఏఐబీపీ కింద వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే అర్హత ఉందో, లేదో మరోసారి పునః పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈఎన్సీ లేఖలో కోరారు.

Tags:    

Similar News