పోలీస్ వ్యవస్థ రద్దు చేద్దాం

వాషింగ్టన్: అమెరికాలో చెలరేగుతున్న ఆందోళనలకు పోలీసు వ్యవస్థే కారణమని అందరూ ఆరోపిస్తున్నారు. ఆఫ్రికా- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత ఆందోళనలు మరింతగా పెరిగాయి. మిన్నెపొలిస్‌లో ప్రారంభమైన ఈ నిరసనలు దేశవ్యాప్తంగా పాకిపోయాయి. దీంతో పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా అక్కడ జరిగిన మినియాపొలిస్ నగర మండలి కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు పలుకుతోంది. మండలిలో 12 మంది సభ్యులు ఉండగా.. వారిలో 9 మంది పోలీసు రద్దు తీర్మానానికి మద్దుతు తెలిపారు. […]

Update: 2020-06-08 09:22 GMT

వాషింగ్టన్: అమెరికాలో చెలరేగుతున్న ఆందోళనలకు పోలీసు వ్యవస్థే కారణమని అందరూ ఆరోపిస్తున్నారు. ఆఫ్రికా- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత ఆందోళనలు మరింతగా పెరిగాయి. మిన్నెపొలిస్‌లో ప్రారంభమైన ఈ నిరసనలు దేశవ్యాప్తంగా పాకిపోయాయి. దీంతో పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా అక్కడ జరిగిన మినియాపొలిస్ నగర మండలి కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు పలుకుతోంది. మండలిలో 12 మంది సభ్యులు ఉండగా.. వారిలో 9 మంది పోలీసు రద్దు తీర్మానానికి మద్దుతు తెలిపారు. ఈ మేరకు మండలి అధ్యక్షడు లిసా బెండర్ వెల్లడించారు. పోలీసు వ్యవస్థ స్థానంొలో పౌరుల రక్షణార్థం మరో ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ.. పూర్తిగా విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు పోలీసు వ్యవస్థ రద్దు చేయడానికి పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. పలు చోట్ల ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా ర్యాలీలు కూడా చేస్తున్నారు. 2000లో కాలిఫోర్నియా రాష్ట్రంలోని క్రాంప్టన్ కౌంటీలో కూడా పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి.. దాని బాధ్యతలను లాస్ ఏంజెలిస్ కౌంటీ పోలీసులకు అప్పగించారు. ఇక 2012లో క్యామ్‌డెన్, న్యూజెర్సీల్లో నేరాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో పోలీసు వ్యవస్థను రద్దు చేశారు. క్యామ్‌డెన్ కౌంటీకి ప్రత్యేకంగా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

వివిధ కౌంటీలు, రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు త్వరలో ‘జస్టీస్ ఇన్ పోలీసింగ్ యాక్ట్ ఆఫ్ 2020’ బిల్లును త్వరలో దిగువ సభలో ప్రవేశ పెట్టనుంది. ప్రజలతో దురుసుగా ప్రవర్తించే పోలీసు అధికారులను గుర్తించేందుకు జాతీయ రిజిస్ట్రీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ బిల్లులో పోలీసుల శిక్షణా విధానంలో తీసుకొని రావల్సిన మార్పులన కూడా చేర్చనున్నారు. అలాగే చౌక్‌హోల్డ్‌లపై నిషేధం, డ్రగ్ కేసుల్లో నో-నాక్ వారెంట్ల జారీపై మార్గదర్శకత్వాలు విడుదల చేయనున్నారు. ఈ పాలసీని ప్రవేశపెట్టడానికంటే ముందు రిపబ్లికన్లు, డెమోక్రాట్లు పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. అయితే డెమోక్రాట్లు ఈ బిల్లుపై పూర్తి స్థాయి మద్దతు అందిస్తున్నా.. రిపబ్లికన్లు మాత్రం మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీస్ ఉద్యోగుల యూనియన్లు మాత్రం ఈ బిల్లును ప్రవేశపెట్టకుండా పొలిటికల్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News