మాదాపూర్‌లో ఆసుపత్రి లైసెన్స్ రద్దు.. మూడింటికి నోటీసులు

దిశ, తెలంగాణ బ్యూరో : రూల్స్ బ్రేక్ చేస్తూ అధిక ఫీజులు వసూలు చేసిన మదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేశామని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులందిన బషీర్‌బాగ్, సికింద్రాబాద్, నాగోల్‌లోని మరో 3 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామన్నారు. మొత్తం 26 ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులు వచ్చాయని వాటన్నింటిని పరిశీలించి తగిన చర్యలు చేపడుతామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల నుంచి పేషెంట్లకు ఎలాంటి […]

Update: 2021-05-18 08:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రూల్స్ బ్రేక్ చేస్తూ అధిక ఫీజులు వసూలు చేసిన మదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేశామని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులందిన బషీర్‌బాగ్, సికింద్రాబాద్, నాగోల్‌లోని మరో 3 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామన్నారు. మొత్తం 26 ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులు వచ్చాయని వాటన్నింటిని పరిశీలించి తగిన చర్యలు చేపడుతామన్నారు.

ప్రైవేటు ఆసుపత్రుల నుంచి పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే ప్రజారోగ్య శాఖ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లెన్స్ ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని తెలిపారు. కోవిడ్ పేషెంట్లను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని ప్రైవేటు ఆసుపత్రులను హెచ్చరించారు.

 

Tags:    

Similar News