Malavya Rajyoga: మాళవ్య రాజయోగం .. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు

మాళవ్య రాజయోగం .. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు

Update: 2024-09-16 07:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. వచ్చే వారం అత్యంత ప్రీతికరమైందిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ వారంలో ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయనున్నాయి. అలాగే నక్షత్ర సంచారం కూడా చేయనున్నాయి. ఎంతో శక్తివంతమైన మాళవ్య రాజయోగం ఏర్పడనుంది. ఎవరి జాతకంలో అయితే ఈ యోగం మంచిగా ఉంటుందో వారికీ అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ యోగం వలన రెండు రాశుల వారు లాభాలు పొందనున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మేషరాశి: 

ఈ యోగం వలన పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అంతే కాకుండా, వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు నుంచి ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా, పరీక్షలు ప్రిపేర్ అయ్యే వారికీ ఈ సమయం ఎంతో శుభంగా ఉంటుంది. ఈ సమయంలో కొత్త కారు లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

సింహరాశి: 

మాళవ్య యోగం వలన ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు. దీని కారణంగా వారు అన్ని వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టిన వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగ రంగాల్లో స్థిరపడిన వారికి ప్రమోషన్ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News