Horoscope: వచ్చే నెల 2 నుంచి ఆ రాశుల వారికీ లాభాలే లాభాలు!

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు స్థానం చాలా ప్రత్యేకం

Update: 2024-08-26 14:44 GMT

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు స్థానం చాలా ప్రత్యేకం. గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఈ గ్రహం 26 రోజుల పాటు వేరే రాశిలో సంచారం చేస్తుంటుంది. అయితే, శుక్రుడు ప్రస్తుతం ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో ఉంది. త్వరలోనే హస్తా నక్షత్రంలోకి సంచరించనుంది. దీని ప్రభావం కొన్ని రాశులవారి మీద చూపనుంది.. వచ్చే నెల 2 న వారికి మంచిగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

కన్యా రాశి

శుక్రుడి సంచారం కన్యా రాశివారికి శుభంగా ఉండనుంది. పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. శత్రువులతో ఇబ్బంది పడే వారికి

వారి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే, మీరు పని చేసే ఆఫీసులో మీ బాస్ నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. చిరు వ్యాపారులకు ఆకస్మికంగా లాభాలు పెరుగుతాయి.

మకర రాశి

మకర రాశివారికి శుక్రుడి సంచారం వలన లాభాలు పెరగనున్నాయి. ముఖ్యంగా, వీరికి అన్ని విధాలుగా కలిసి రానుంది. పెట్టుబడులు పెట్టె వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే వారి కల నెరవేరుతుంది. కొత్తగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News