Horoscope: భాద్రపద అమావాస్య .. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు

భాద్రపద అమావాస్య .. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు

Update: 2024-08-31 06:42 GMT

దిశ, వెబ్ డెస్క్: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. భాద్రపద అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ ఏడాది ఈ అమావాస్య సెప్టెంబర్ 2 న వచ్చింది. ఈ రోజున చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం పిండ ప్రధానం వంటి పనులు చేస్తారు. ఇలా చేయడం వలన దోషాలు తొలగుతాయి. ముఖ్యంగా, శుక్రుడు సంచారం కారణంగా రెండు రాశుల వారికి మంచిగా ఉండనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

సింహ రాశి

ముఖ్యంగా, శుక్రుడు ప్రవేశం వలన ఈ రాశి వారికి శుభంగా ఉండనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా సమాజంలో కీర్తి, డబ్బు వచ్చే అవకాశం ఉంది. పాత కాలంలో కొన్న భూములకు రేట్లు పెరుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో సంపాదన కూడా భారీగా పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి.

కన్యా రాశి

భాద్రపద అమావాస్య రోజున శుక్రుడు ప్రవేశం కారణంగా ఈ రాశి వారికి మంచిగా ఉంటుంది. ముఖ్యంగా పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. అన్ని పనుల్లో విజయం సాధించడమే కాకుండా పెద్ద మొత్తంలో డబ్బు చేరుతుంది. ముఖ్యంగా అమావాస్య నుంచి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News