జగిత్యాలలో కనువిందు చేసిన ‘హార్న్ బిల్’ పక్షి
దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణా నగర్‌లో గురువారం అరుదైన పక్షి కాలనీ వాసుల కంట పడింది. పక్షిని గమనించిన స్థానికులు చూడటానికి అధిక సంఖ్యలో వచ్చారు. స్థానిక యువకుడు హరీష్ అనే యువకుడు తన సెల్ మొబైల్‌లో వీడియో తీసాడు. ఆ పక్షిని గమంచిన కొందరు చాలా అరుదుగా కనిపించే ‘అడవి రైతు’ (ఇండియన్ గ్రై హార్న్ బిల్) అనే పక్షి అని చెప్పుకుంటున్నారు. ఎక్కువగా దక్షిణ ఉపఖండంలో కనిపిస్తుందని, ఎత్తైన ప్రదేశాల్లో […]
దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణా నగర్‌లో గురువారం అరుదైన పక్షి కాలనీ వాసుల కంట పడింది. పక్షిని గమనించిన స్థానికులు చూడటానికి అధిక సంఖ్యలో వచ్చారు. స్థానిక యువకుడు హరీష్ అనే యువకుడు తన సెల్ మొబైల్‌లో వీడియో తీసాడు. ఆ పక్షిని గమంచిన కొందరు చాలా అరుదుగా కనిపించే ‘అడవి రైతు’ (ఇండియన్ గ్రై హార్న్ బిల్) అనే పక్షి అని చెప్పుకుంటున్నారు.
ఎక్కువగా దక్షిణ ఉపఖండంలో కనిపిస్తుందని, ఎత్తైన ప్రదేశాల్లో ఉంటుందని పక్షి ప్రేమికులు పేర్కొంటున్నారు. ఈ పక్షి సుమారు 50 సెంటీమీటర్ల పొడవు గల ముక్కు, తోక కలిగి నలుపు, బూడిద, తెలుపు రంగులలో ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైందని తెలుస్తోంది