కొత్త బైకును మార్కెట్లో విడుదల చేసిన హోండా!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) భారత మార్కెట్లో తన సరికొత్త బైకును విడుదల చేసింది. సీబీ 200ఎక్స్ పేరుతో తెచ్చిన ఈ మోడల్ ధరను రూ. 1.44 లక్షలుగా(ఎక్స్‌షోరూమ్) నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. రోజూవారీగా వినియోగానికి మాత్రమే కాకుండా ఆఫ్‌రోడ్ ప్రయాణానికి వీలుగా ఈ బైక్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హీరో ఎక్స్‌పల్స్ 200ఎక్స్‌కు హోండా కొత్త బైకు మార్కెట్లో […]

Update: 2021-08-19 06:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) భారత మార్కెట్లో తన సరికొత్త బైకును విడుదల చేసింది. సీబీ 200ఎక్స్ పేరుతో తెచ్చిన ఈ మోడల్ ధరను రూ. 1.44 లక్షలుగా(ఎక్స్‌షోరూమ్) నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. రోజూవారీగా వినియోగానికి మాత్రమే కాకుండా ఆఫ్‌రోడ్ ప్రయాణానికి వీలుగా ఈ బైక్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హీరో ఎక్స్‌పల్స్ 200ఎక్స్‌కు హోండా కొత్త బైకు మార్కెట్లో పోటీ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ బైకులో భారత్ స్టేట్-6 పూర్తి అధునాతన 184సీసీ ఇంజిన్‌తో రూపొందించామని, దీంతో పాటు ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, డిజిటల్ లిక్విడ్ క్రిస్టల్ మీటర్ ఇంకా అనేక కొత్త ఫీచర్లను ఇందులో అందించినట్టు కంపెనీ వివరించింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందించే వాహనాల పట్ల ఆసక్తి ఉండే పట్టణ యువతను దృష్టిలో ఉంచుకుని కొత్త రైడింగ్ అనుభూతిని ఇచ్చేలా సీబీ 200ఎక్స్ బైకును తయారు చేశామని హోండా సంస్థ అధ్యక్షుడు, సీఈఓ అత్సుషి ఒగాటా చెప్పారు. ఈ మోటార్‌సైకిల్ కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించామని, డెలివరీలను సెప్టెంబర్ నుంచి అందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News