ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీపై హైపవర్ కమిటీ రిపోర్టు
దిశ, వెబ్‌డెస్క్: మే 7న విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదిక సమర్పించింది. సోమవారం క్యాంప్ ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన కమిటీ సభ్యులు రిపోర్టును అందజేశారు. గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో బాధిత ప్రజలు, రాజకీయ నేతలతో చర్చించిన హైపవర్ కమిటీ అధ్యయనం చేసి రిపోర్టును తయారు చేసింది. ప్రమాదం జరిగిన తీరు, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు మరోసారి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీ నివేదిలో […]
దిశ, వెబ్‌డెస్క్: మే 7న విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదిక సమర్పించింది. సోమవారం క్యాంప్ ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన కమిటీ సభ్యులు రిపోర్టును అందజేశారు. గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో బాధిత ప్రజలు, రాజకీయ నేతలతో చర్చించిన హైపవర్ కమిటీ అధ్యయనం చేసి రిపోర్టును తయారు చేసింది. ప్రమాదం జరిగిన తీరు, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు మరోసారి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీ నివేదిలో పేర్కొంది. అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ హైపవర్ కమిటీలో ఉన్నారు.