బిగ్ బ్రేకింగ్.. ఎన్నికలపై హైకోర్టు స్టే
దిశ, వెబ్డెస్క్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికలపై స్టే విధిస్తున్నట్లు ఇవాళ తీర్పునిచ్చింది. ఎన్నికలను నిలిపివేయాలంటూ టీడీపీ వేసిన పిటిషన్పై గత కొద్దిరోజులుగా విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇవాళ ఎన్నికలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15న ఎస్ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీలో 511 జెడ్పీటీసీలకు ఎల్లుండి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో హైకోర్టు స్టే విధించడంతో.. ఎన్నికలు వాయిదా పడే అవకాశముంది. […]
దిశ, వెబ్డెస్క్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికలపై స్టే విధిస్తున్నట్లు ఇవాళ తీర్పునిచ్చింది. ఎన్నికలను నిలిపివేయాలంటూ టీడీపీ వేసిన పిటిషన్పై గత కొద్దిరోజులుగా విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇవాళ ఎన్నికలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15న ఎస్ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఏపీలో 511 జెడ్పీటీసీలకు ఎల్లుండి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో హైకోర్టు స్టే విధించడంతో.. ఎన్నికలు వాయిదా పడే అవకాశముంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.