ప్రభుత్వ వివరణ లేకుండా LRSపై స్టే ఇవ్వలేం : హైకోర్టు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్ఎస్‌ తమపై పెనుభారం మోపిందని పేద, సామాన్య ప్రజానీకం గగ్గోలు పెడుతోంది. తొలుత అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకొచ్చినట్లు తెలిపిన ప్రభుత్వం ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భూములకు దీనిని వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. ఇక్కడే సామాన్య ప్రజలకు అసలు సమస్య ఎదురైంది. అసలే లాక్‌డౌన్ కష్టాల నుంచి ఇప్పుడిపుడే బయట పడుతున్న ప్రజలపై టీఆర్ఎస్ సర్కార్ కొత్త భారం మోపిందని అన్ని వర్గాల నుంచి విమర్శలు […]

Update: 2020-11-05 06:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్ఎస్‌ తమపై పెనుభారం మోపిందని పేద, సామాన్య ప్రజానీకం గగ్గోలు పెడుతోంది. తొలుత అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకొచ్చినట్లు తెలిపిన ప్రభుత్వం ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భూములకు దీనిని వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. ఇక్కడే సామాన్య ప్రజలకు అసలు సమస్య ఎదురైంది. అసలే లాక్‌డౌన్ కష్టాల నుంచి ఇప్పుడిపుడే బయట పడుతున్న ప్రజలపై టీఆర్ఎస్ సర్కార్ కొత్త భారం మోపిందని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే LRSను రద్దు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ల తరపున వాదనలు విన్నారు. ఎల్ఆర్‌ఎస్‌తో పేద, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కావున దానిపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు వాదించారు. అయితే, ప్రభుత్వ వివరణ లేకుండా LRSపై స్టే ఇవ్వలేమని హైకోర్టు చెప్పగా.. పూర్తి వివరాలతో ఈనెల 11న కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

Tags:    

Similar News