ఏపీలో సినిమా టికెట్ల ధరలు.. హైకోర్టు సంచలన ఆదేశాలు

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. టికెట్ ధరలను తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సింగిల్ జడ్జీ బెంచ్ కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మకాలు జ‌ర‌గాల‌ని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును స‌వాల్ చేస్తూ సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై డివిజన్ బెంచ్‌లో ఏపీ సర్కార్ అప్పీల్ చేయ‌డంతో గురువారం విచార‌ణ జ‌రిగింది. జగన్ […]

Update: 2021-12-16 02:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. టికెట్ ధరలను తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సింగిల్ జడ్జీ బెంచ్ కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మకాలు జ‌ర‌గాల‌ని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును స‌వాల్ చేస్తూ సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై డివిజన్ బెంచ్‌లో ఏపీ సర్కార్ అప్పీల్ చేయ‌డంతో గురువారం విచార‌ణ జ‌రిగింది.

జగన్ సర్కార్ తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ల యజమానులు జాయింట్ కలెక్టర్ ముందుకు తీసుకు రావాలని ఆదేశించింది. ధరలపై వారి నిర్ణయమే ఫైనల్ అని, టికెట్ ధరలపై ప్రభుత్వమే ఓ కమిటినీ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News