డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ఫ్రెండ్స్‌కి కాల్ చేయండి.. బైక్ ఇచ్చేస్తారు..!
దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం తాగి వాహనం నడపడం ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించడమే. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడమే కాకుండా వారిపై కేసు నమోదు చేస్తారు. అయితే, ఇదంతా అప్పుడు.. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ఆ వెహికిల్‌ను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అంతేకాకుండా, వాహనాన్ని డ్రింక్ చేసిన వ్యక్తికి కాకుండా మద్యం తాగని మరొకరు వెంట ఉంటే […]
దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం తాగి వాహనం నడపడం ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించడమే. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడమే కాకుండా వారిపై కేసు నమోదు చేస్తారు. అయితే, ఇదంతా అప్పుడు.. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ఆ వెహికిల్‌ను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అంతేకాకుండా, వాహనాన్ని డ్రింక్ చేసిన వ్యక్తికి కాకుండా మద్యం తాగని మరొకరు వెంట ఉంటే వాహనం అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఎవరూ లేకపోతే స్నేహితులను పిలిపించి వాహనాలు ఇవ్వాలని సూచించింది. ఎవరూ రాకుంటే వాహనాన్ని స్టేషన్‌కి తీసుకెళ్ళి ఆ మరుసటి రోజు వాహనదారుడికి ఇచ్చేయాలని చెప్పుకొచ్చింది.